War in Darfur : సూడాన్ పశ్చిమ డార్ఫూర్ రాష్ట్ర రాజధాని నగరం ఎల్ జెనీనాలో చోటు చేసుకున్న ఒక అస్థిర హింసాత్మక దాడిలో దాదాపు 130మంది మరణించారు. 189 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ఎల్ జెనీనాలో రక్తపాత సంఘటనల వల్ల మృతుల సంఖ్య 130 కు చేరుకుందని అధికారులు తెలుపుతున్నారు.
శనివారం నుండి గాయపడిన వారి సంఖ్య 189కి చేరుకుందని అని తెలుస్తుంది. దశాబ్దాల అంతర్యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో అరబ్, అరబ్ యేతర గిరిజన తెగల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. అరబ్ రిజీగాట్ తెగ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అరబ్ యేతర సంప్రదాయ మస్సాలిత్ గిరిజనులు పోరాడుతున్నారు.