జపాన్‌లో ఈ రోజు ఉదయం రెండు భారీ భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. గంటల వ్యవధిలో ఇవి జపాన్‌ను వణికించాయి. గురువారం రాత్రి 10.43 నిమిషాలకు, తొలి భూకంపం రాగా.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదైంది. ఇవాళ ఉదయం ఏడున్నరకు మరోసారి భూమి కంపించగా దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. సముద్రంలో భూకంపం రావడంతో సునామీ ముప్పుగా తొలుత భావించారు. కానీ.. దాని తీవ్రత ఆ స్థాయిలో లేదని అధికారులు చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.