USA: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 21 మంది మృతి, వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం!

అమెరికాలో తీవ్రమైన తుఫానులు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సెంట్రల్ యునైటెడ్ స్టేట్స్‌లోని మిస్సౌరీ, కెంటకీ రాష్ట్రాల్లో ఈ ట్రోర్నడోల బీభత్సంలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరి కొందరు తీవ్రంగా గాయడ్డారని.. భారీ మొత్తంలో ఆస్తి నష్టం కూడా జరిగినట్టు గవర్నర్ ఆండీ బెషీర్ ప్రకటించారు. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

USA: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 21 మంది మృతి, వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం!
America

Updated on: May 17, 2025 | 10:08 PM

అమెరికాలోని లారెల్ కౌంటీలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో టొర్నడో బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. దీంతో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాల పేర్కొన్నారు. ఈ తుఫాన్, టోర్నడోల ఎఫెక్ట్‌తో ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ ఈదురుగాలతో స్థంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.

మిస్సౌరీలో, కెంటకీ రాష్ట్రాల్లో శుక్రవారం టోర్నడోలు బీభత్సం సృష్టించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కొన్ని నివేదకల ప్రకారం రద్దీగా ఉండే రహదారిపై ఈ టోర్నడోలు ప్రారంభమై నగరంలో 20 చదరపు బ్లాక్‌ల ప్రాంతంలో విధ్వంసం సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా మిస్సోరీలో ఐదువేల భవనాలకుపైగా దెబ్బతిన్నాయని మేయర్ కారా తెలిపారు. స్కాట్ కౌంటీలోనూ టోర్నడోల బీభత్సంలో ఇద్దరు మరణించడంతో పాటు అనేక ఇళ్లు ధ్వంసంమైనట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇల్లినోయీలో కూడా టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నట్టు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..