ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్ బెర్గ్ కుమార్తె మికేలాను పోలీసులు అరెస్టు చేశారు. తను పోర్న్ స్టార్ గా త్వరలో కెరీర్ ను ఆరంభించాలనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేసిన ఈ అమ్మడు డొమెస్టిక్ వయొలెన్స్ (గృహహింస)కు పాల్పడిందట. ‘డాట్స్ (చిన్న బాణపు ముక్కలతో లక్ష్యాన్ని ఛేదించే) ప్లే లో పాపులర్ అయిన ఆటగాడు చక్ పాంకోతో సహజీవనం చేస్తున్న ఈమెను నష్ విల్లేలో శనివారం అరెస్టు చేశారు. చక్ పై మికేలా దాడికి దిగిందట. ఈ ఆరోపణపై ఈమెను పోలీసులు ఓ నిర్బంధ శిబిరానికి తరలించారు.
ఈమె విడుదలయ్యేలా బెయిల్ కోసం అప్పుడే ఎవరో వెయ్యి డాలర్లు పోస్ట్ చేశారు. అయితే 12 గంటల అనంతరమే మికేలా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తాను ఎడల్ట్ ఇండస్ట్రీలో ప్రవేశిస్తానని సుమారు రెండు వారాల క్రితమే ప్రకటించిన ఈమె.. తన సొంత సోలో పోర్న్ వీడియోలను ప్రొడ్యూస్ చేస్తోంది కూడా.. తన నిర్ణయంపై తన తలిదండ్రులు అప్ సెట్ కాలేదని, ఇది నీ సొంత నిర్ణయమని స్వేఛ్చ ఇచ్చారని మికేలా చెప్పుకున్నప్పటికీ.. ముఖ్యంగా స్పీల్ బెర్గ్ మాత్రం చాలా ఇరకాటంలో పడ్డారు. ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఒక దశలో ఇది సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. మికేలా చిన్న పిల్లగా ఉండగా ఆయన ఈమెను దత్తత తీసుకుని వఛ్చి పెంచుకున్నారు.