జర్మనీ తర్వాత ఇప్పుడు నైజీరియాలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో పెను ప్రమాదం సంభవించింది. నైజీరియా క్రిస్మస్ వేడుకల రెండు ఈవెంట్లలో విరాళాలు, ఆహార పదార్థాల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో మృతుల సంఖ్య 32కి చేరింది. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. ఆహార పదార్థాల కోసం అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో గుమిగూడారని, తొక్కిసలాట కారణంగా చాలా మంది కింద పడిపోయారని, దీని కారణంగా చాలా మంది మరణించారని పోలీసులు చెప్పారు.
మొదటి సంఘటన ఆగ్నేయ అనంబ్రా రాష్ట్రంలోని ఓకిజా పట్టణంలో జరిగింది. ఇందులో 22 మంది మరణించారని పోలీసు ప్రతినిధి తోచుక్వు ఇకెంగా తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఓ దాత ఓకిజాలో ఆహార పంపిణీని నిర్వహించాడు. ఈ సమయంలో జనంలో తొక్కిసలాట జరిగింది. అలాగే, రాజధాని అబుజాలోని ఒక చర్చి ఆహారం, దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమయంలో తొక్కిసలాట కారణంగా ప్రమాదం సంభవించి, పది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
జర్మనీలో ఐదుగురు మృతి
దీనికి ఒకరోజు ముందు శనివారం(డిసెంబర్ 21) క్రిస్మస్ వేడుకల సందర్భంగా జర్మనీలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో 5 మంది మరణించగా, 7 మంది భారతీయులతో సహా 200 మందికి పైగా గాయపడ్డారు. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకల సందర్భంగా యూరప్ మార్కెట్‌లలో డెకరేషన్, షాపింగ్, వివిధ పాటలు, సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ గుమిగూడారు. ఈ సందర్భంగా ప్రజలకు బహుమతులు కూడా పంపిణీ చేస్తారు. ఈ సమయంలో తొక్కిసలాట కారణంగా ఈ ప్రమాదం జరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..