Sri Lanka Crisis: శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంక్షోభాన్ని నివారించడానికి ఆ దేశ అధ్యక్షుడు గొటబాయే రాజపక్పే (President Gotabaya Rajapaksa) అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 11 పార్టీలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త ప్రధానిని కూడా అఖిలపక్షం ఎన్నుకుంటుంది. తన సోదరుడు మహేంద్ర రాజపక్సేను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కూడా గొటబాయే రాజపక్సే సమ్మతించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మరింత విజృంభించడంతో.. రాజపక్సే ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ఫ్రీడం పార్టీకి చెందిన మైత్రిపాల సిరిసేన శ్రీలంక ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. అతిత్వరలో మహేంద్ర రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సేతో సహా రాజపక్సే, అతని కుటుంబం గత 20 ఏళ్లలో శ్రీలంకలో దాదాపు ప్రతి అంశంలోనూ ఆధిపత్యం చెలాయించారు.
గొటబాయేతో భేటీ అనంతరం పార్లమెంట్‌లోని అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రధానిని జాతీయ కౌన్సిల్‌ను నియమించనున్నామని చట్టసభ సభ్యుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. అయితే.. ఈ విషయంలో అధ్యక్షుడు ఎటువంటి ప్రకటన చేయలేదని, అలాంటి చర్య తీసుకుంటే నిర్ణయం తెలియజేస్తామని మహీందా రాజపక్సే అధికార ప్రతినిధి రోహన్ వెలివిటా చెప్పారు.
అంతకుముందు, రాజపక్సే తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. దేశంలోని ప్రజల నిరసనను తగ్గించేందుకు ఐక్య ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. అయితే ప్రతిపక్షాలు రాజపక్స సోదరుల నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శ్రీలంకకు ప్రపంచ బ్యాంకు సహాయం:
22 మిలియన్ల జనాభా కలిగిన ద్వీప దేశం శ్రీలంకలో ఆహారం, ఇంధనం , ఔషధాల కొరత తీవ్ర రూపం దాల్చింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రజలు, కార్మికులు, అన్ని రంగాల వారు సమ్మెకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్సతో పాటు ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు వెయ్యి కార్మిక సంఘాలు గురువారం ఒక్కరోజు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (SLFP)కి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార SLPP సంకీర్ణ అసమ్మతివాదుల ప్రతినిధి బృందం గురువారం శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లేతో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభనను గురించి వివరించారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను కూడా గోపాల్ కు వివరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Pushpa Movie: పుష్ప ఫీవర్ కంటిన్యూస్.. కాశ్మీరీ వ్యక్తి నోట పుష్ప అంటే ఫైర్ డైలాగ్స్.. వీడియో వైరల్