Sri Lanka Crisis: ఒక కుర్చీని కాపాడటం కోసం భద్రతాలు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఆ కుర్చీ వద్దకు ఎవరూ రాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ చైర్ చుట్టూ ఆర్మీ సిబ్బంది ఆయుధాలు చేతబూని రక్షణ కవచంలా నిల్చున్నారు. అవును.. మీరు వినేది నిజమే. ఆ కుర్చీ ఒక దేశ ప్రధానిది. అదికూడా మన పొరుగు దేశమైన శ్రీలంక ప్రధాని కుర్చీ. ఇటీవలే దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్సెను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష నివాసంపై ఆందోళనకారులు అటాక్ చేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష భవనంలోకి చొరబడి రచ్చ రచ్చ చేసేశారు.
తాజాగా కొలంబోలోని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కార్యాలయంపైనా నిరసనకారులు దాడి చేశారు. అయితే, దేశాధ్యక్షుడు కార్యాలయంపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్ష భవనంలో జరిగిన విధ్వంసం.. ప్రధాని భవనంలో జరుకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు. సైనిక సిబ్బంది ఆయన కార్యాలయానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి కుర్చీకి కాపలాగా ఉన్నారు.
కాగా, అధికార పునరుద్ధరణ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని మిలటరీ, పోలీసులను ఆదేశించినట్లు రహస్య ప్రదేశంలో ఉన్న ప్రధాని రణీల్ విక్రమసింఘే ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. రాజపక్సే, విక్రమసింఘేలను గద్దే దింపే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని నిరసనకారులు స్పష్టం చేశారు. అదేసమయంలో అధికారిక భవనాలపై దాడులు చేయబోమని కూడా ప్రకటించారు.
#WATCH | Sri Lankan military personnel guard the Prime Minister’s chair in his office in Colombo, in view of the #SriLankaProtests pic.twitter.com/kd9L7Fevm8
— ANI (@ANI) July 14, 2022