Special Garage: కోట్ల రూపాయలు పలుకుతున్న చిన్న గ్యారేజీ.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే అబ్బురపోతారు..!

Special Garage: పెట్టుబడుల ద్వారా సంపాదించాలనుకునే వారు ఎక్కువగా ఆస్తులు కొనుగోలు, అమ్మకాలను ప్రధాన ఎంపికగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్..

Special Garage: కోట్ల రూపాయలు పలుకుతున్న చిన్న గ్యారేజీ.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే అబ్బురపోతారు..!
Home
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2022 | 5:40 PM

Special Garage: పెట్టుబడుల ద్వారా సంపాదించాలనుకునే వారు ఎక్కువగా ఆస్తులు కొనుగోలు, అమ్మకాలను ప్రధాన ఎంపికగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అయితే, గత కొద్దికాలంగా ఈ ఆస్తుల డీలింగ్స్ వ్యవహారాలు ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. బ్రోకర్స్ ద్వారా కాకుండా నేరుగా యజమానిని సంప్రదించడం ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. దాంతో విక్రేతకు, కొనుగోలుదారులకు మధ్య ఎలాంటి సమస్యా తలెత్తడం లేదు. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని. దానికి ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఏకేంగా కోట్ల రూపాయలు చెల్లించి ఆ గ్యారేజీని సొంతం చేసుకునేందుకు ముందుకొచ్చారు కొనుగోలుదారులు.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూకే లోని న్యూకాజిల్‌లో ఈ గ్యారేజీ ఉంది. ఈ గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు యజమాని. అయితే, గ్యారేజీ వెనుక ఓ టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నీస్ కోర్టు కారణంగానే దానికి విపరీతమైన డిమాండ్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆ గ్యారేజీకి కోట్ల రూపాయలు ఎందుకు? వాస్తవానికి ఈ గ్యారేజీ ఉన్న ప్రదేశం బ్రిటన్‌లోని అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతం. ఈ గ్యారేజీ వెనుకాలే ఓ ప్రైవేట్ టెన్నిస్ కోర్టు ఉండటం దానికి కలిసొచ్చింది. అంతకంటే ముఖ్యంగా ఈ గ్యారేజీ ఉన్న ప్రాంతంలో ధనవంతులకు నిలయం. అనేక ప్రసిద్ధ పాఠశాలలు కూడా ఉన్నాయి. అయితే, Property selling site RightMove సైట్‌లో ఈ గ్యారేజీని విక్రయానికి పెట్టారు. ఈ గ్యారేజీ ఫోటోను సైట్‌లో అప్‌లోడ్‌ చేసినప్పుడు చాలా మంది కొనుగోలుదారులు ఈ చిన్న గ్యారేజీని కొనడానికి కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించాలని అనే ప్రశ్నలను లేవనెత్తారు. అయితే, రైట్‌మూవ్ సైట్ గ్యారేజీతో కూడిన టెన్నిస్ కోర్ట్ ఫోటోని చూసి.. చాలా మంది దానిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే.. ఆ గ్యారేజీని కొనుగోలు చేసిన వారు పక్కనే ఉన్న టెన్నిస్ కోర్టుకు కూడా యజమాని అవుతారు. ఆ కారణంగానే దానిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిచూపుతున్నారు.

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ