Jackpot: తెలంగాణ కార్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజులో తిరిగిన సుడి.. ఏకంగా రూ. 33 కోట్ల లాటరీ

|

Dec 24, 2022 | 9:46 PM

ఈ విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పినప్పుడు వారు కూడా నమ్మలేదన్నాడు. తనకు లాటరీ తగిలిందన్న వార్త మీడియాలో వచ్చినప్పుడే వారంతా తనను నమ్మారని చెప్పాడు. తనకు లక్కీ లక్ష్మి లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Jackpot: తెలంగాణ కార్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజులో తిరిగిన సుడి.. ఏకంగా రూ. 33 కోట్ల లాటరీ
Indian Driver
Follow us on

దుబాయ్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి భారీ జాక్‌పాట్ తగిలింది. డ్రైవర్‌గా పనిచేసే అజయ్ ఓగులా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అవును, దుబాయ్ ‘ఎమిరేట్స్ డ్రా’ లాటరీలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూ.33 కోట్లు గెలుచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం పని వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లిన అజయ్ ఓ నగల దుకాణంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు 72 వేలు. (3,200 దిర్హామ్‌లు) ఈ అదృష్టవంతుడు భారీ లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అజయ్‌కు లాటరీ రూపంలో లక్ష్మిదేవి భారీ అదృష్టాన్ని ప్రసాదించింది. మామూలు డ్రైవర్ గా కష్టపడి పనిచేసిన అజయ్ ఇప్పుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

భారీ మొత్తాన్ని గెలుచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన అజయ్.. ‘తాను రూ.33 కోట్లు గెలుచుకున్నానని చెప్పాడు. తనకు లాటరీ తగిలిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పినప్పుడు వారు కూడా నమ్మలేదన్నాడు. తనకు లాటరీ తగిలిందన్న వార్త మీడియాలో వచ్చినప్పుడే వారంతా తనను నమ్మారని చెప్పాడు. తనకు లక్కీ లక్ష్మి లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

తనకు వచ్చిన లాటరీ డబ్బుతో తన కలలన్నీ నెరవేర్చుకుంటానన్నారు. అంతేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మా గ్రామం, చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు సహాయం చేస్తాను. మా ఇంటి కోరికలు తీరుస్తానన్నాడు అజయ్ . బ్రిటీష్ మూలానికి చెందిన పౌలా లీచ్ ఇదే లాటరీలో రూ. 17.5 లక్షలు (దిర్హం 77,777) గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి