నేటి యువ భారతం గుండె దడతో అల్లాడుతోంది. ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ.. ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వాళ్లను కూడా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. యుక్త వయసులో హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా దక్షిణాప్రికాకు చెందిన యువ ర్యాపర్, సాంగ్ రైటర్ కోస్టా టిచ్ లైవ్ మ్యూజిక్ షో చేస్తూనే స్టేజీపైనే కుప్పకూలిపోయాడు. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పడిపోయాడు. ఇది గమనించిన తోటి కళాకారులు అతన్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కోస్టా ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోస్టా టిచ్ మరణవార్త అతని కుటుంబసభ్యులతో పాటు యావత్తు సంగీత ప్రియులను కలచివేసింది. వేదికపై స్పృహతప్పి పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
RIP Costa Titch pic.twitter.com/zQN4pvl6hD
— ?????? (@nwanyebinladen) March 11, 2023
జోహన్నెస్‌బర్గ్‌లో అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల సంగీత విద్వాంసుడు తన పాటలలో ఒకదాన్ని ప్రదర్శిస్తుండగా వేదికపై కుప్పకూలిపోయాడు. ఈ యువ ర్యాపర్ జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ‘అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్’లో లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈక్రమంలోనే పాట పాడుతూనే సడన్‌గా స్టేడీపై పడిపోయాడు. వెంటనే లేచి నిల్చున్నా.. మళ్లీ క్షణాల్లోనే కుప్పకూలాడు. ఇతర సింగర్లు వెంటనే అతనికి సాయం అందించారు. కానీ అతడు స్పృహలోకి రాలేదు. కాసేపటికే చనిపోయాడు. అతను మృతి పట్ల కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తాము అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు భారమైన హృదయంతో చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.