Video: తలకిందులుగా ల్యాండ్ అయిన ప్యాసింజర్ విమానం.. క్షణాల్లోనే..

|

Jul 19, 2022 | 7:42 PM

Plane Crash: సోమాలియా రాజధాని మొగదిషులోని ఎయిర్‌ఫీల్డ్‌లో ప్యాసింజర్ ప్లేన్ కుప్పకూలిపోయింది. విమానంలో ఉన్న 30 మంది ప్రయాణికులు

Video: తలకిందులుగా ల్యాండ్ అయిన ప్యాసింజర్ విమానం.. క్షణాల్లోనే..
Plane Crash
Follow us on

Plane Crash: సోమాలియా రాజధాని మొగదిషులోని ఎయిర్‌ఫీల్డ్‌లో ప్యాసింజర్ ప్లేన్ కుప్పకూలిపోయింది. విమానంలో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బటయపడ్డారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో తలకిందులు అయ్యింది. దాంతో విమానం క్రాష్ అయ్యింది. అయితే, ప్లైట్ గాల్లోనే తలకిందులు అవడాన్ని గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది, రెస్క్యూ టీమ్ అలర్ట్ అయ్యింది. వెంటనే రన్‌వే పై కుప్పకూలిన విమానం వద్దకు వచ్చి.. అందులోని ప్రయాణికులందరినీ కాపాడారు. ఆ మరుక్షణమే.. విమానంలో మంటలు చెలరేగాయి. నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్నంతా కమ్మేసింది. అప్పటికే సిద్దంగా ఫైర్ సిబ్బంది ఆ మంటలను ఆర్పేశారు. ఈ షాకింగ్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఒల్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.

జుబ్బా ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం సోమాలియాలోని నగరాల మధ్య తిరుగుతుంది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అంతా సేఫ్‌గా ఉన్నారని జుబ్బా ఎయిర్‌వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..