Sri Lanka food crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం! కిలో బియ్యం రూ.220, పాలపొడి రూ.1900, గుడ్డు ధర చూస్తే గుడ్లు తేలేస్తారు..

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు చెక్ పెడుతూ 36 గంటల పాటు నిరవధికంగా కర్ఫ్యూ విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ ..

Sri Lanka food crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం! కిలో బియ్యం రూ.220, పాలపొడి రూ.1900, గుడ్డు ధర చూస్తే గుడ్లు తేలేస్తారు..
Sri Lanka Economic Crisis
Follow us

|

Updated on: Apr 04, 2022 | 2:03 PM

Skyrocketing rates at supermarket in crisis-hit Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకవాసులకు(Sri Lanka) ప్రభుత్వంపై వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే దేశ రాజధానితో సహా పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలకు దిగారు. ఓవైపు నిత్యావసర వస్తువుల కొరత, మరోవైపు విద్యుత్తు షార్జేజ్‌ నిరంతరంగా కొనగాగుతుండటంతో ఆందోళనకారుల నిరసనలు మిన్నంటాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొనేందుకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స (President Gotabaya Rajapaksa) శుక్రవారం (ఏప్రిల్‌ 1) ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు చెక్ పెడుతూ 36 గంటల పాటు నిరవధికంగా కర్ఫ్యూ విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

మన దాయాది దేశమైన శ్రీలంకలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కరెన్సీ రోజురోజుకూ బలహీనపడుతోంది. వెరసి నిత్యావసర వస్తువుల ధరలు అక్కడ ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార వస్తువులు కొనాలంటే సామాన్యుడి పర్సుకు చిళ్లు పడే పరిస్థితి నొలకొంది. కిలో చొప్పున బియ్యం రూ. 220లు, గోధుమలు రూ. 190లు, పంచదార రూ.240లు, కొబ్బరినూనె లీటరు రూ.850లు, ఒక్క గుడ్డు ధర రూ. 30లు, ఇక1 కేజీ మిల్క్‌ పౌడర్ ధర కనీవినని రీతిలో ఏకంగా రూ.1900లు పలుకుతోంది. పెరిగిన ధరల దృష్ట్యా లంక వాసులు గుడ్లు తేలేస్తున్నారు. గత ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 17.5 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం అయితే 25 శాతానికి పైగా పెరిగింది. దీంతో ఆహార, తృణ ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. గంటల తరబడి క్యూలో నిలబడి, తీరా తమ వంతు రాగానే కొనవల్సిన వస్తువుకు సరిపడ డబ్బు తమవద్ద లేకపోవడంతోనో లేక షాపుల్లో సరుకు ఖాళీ అవ్వడం చేతనో చాలా మంది ఒట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు. మందులు, పాలపొడి కొరత ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక సూపర్‌మార్కెట్‌ను సందర్శించిన మీడియాకు ఈ దృశ్యాలు చిక్కాయి.

Also Read:

NIMS Hyderabad Jobs 2022: నెలకు రూ. 1,30,000ల జీతంతో పంజాగుట్ట నిమ్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

Latest Articles
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..