George Floyd: నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగి ఏడాది, మినియాపొలీస్ లో కాల్పులు, ఒకరికి గాయాలు, పోలీసులు అలర్ట్

George Floyd: అమెరికాలోని మినియాపొలీస్ రాష్ట్రంలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య జరిగి బుధవారానికి ఏడాది అయింది. ఈ సందర్భంగా ఆ స్థలంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు

George Floyd: నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగి ఏడాది, మినియాపొలీస్ లో కాల్పులు, ఒకరికి గాయాలు, పోలీసులు అలర్ట్
George Floyd

Edited By: Phani CH

Updated on: May 26, 2021 | 9:16 AM

అమెరికాలోని మినియాపొలీస్ రాష్ట్రంలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య జరిగి బుధవారానికి ఏడాది అయింది. ఈ సందర్భంగా ఆ స్థలంలో కొందరు వ్యక్తులు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. సమీపంలోని ఓ ఆసుపత్రి వద్ద గాయాలతో పడి ఉండగా అతడిని పోలీసులు కనుగొన్నారు. వేగంగా ఓ వాహనంలో వెళ్తూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం లేదన్నారు. ఫ్లాయిడ్ మెమోరియల్ వద్ద కొన్ని తూటాలను వారు గమనించారు. ఇదే స్థలంలో ఓ సెలూన్ కిటికీ భాగం బద్దలై ఉందని వారు చెప్పారు. అటు ఈ మెమోరియల్ వద్ద కొంతమంది పుష్ప గుఛ్చాలు ఉంచి ఫ్లాయిడ్ కి నివాళులు అర్పించారు. గత ఏడాది డెరెక్ అనే పోలీసు అధికారి జార్జి మెడపై గట్టిగా కాలిని నొక్కి పెట్టి ఉంచడంతో శ్వాస ఆడక అతడు మరణించాడు. దీంతో అమెరికాలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. మినియాపోలిస్ సహా పలు రాష్ట్రాల్లో నల్ల జాతీయులు భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేశారు.అప్పటి నుంచి బ్లాక్ లైవ్స్ మూవ్ మెంట్ ప్రారంభమైంది. నల్లజాతీయుల పట్ల జాతి వివక్ష అంతం కావాలంటూ అనేకమంది ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ఇలా ఉండగా జార్జి ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు వాషింగ్టన్ లో అధ్యక్షుడు జొబైడెన్ ని కలిసి పాలసీ చట్టంలో ఫ్లాయిడ్ జస్టిస్ పేరిట సంస్కరణల బిల్లును యూఎస్ కాంగ్రెస్ ఆమోదించేలా చూడాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వారు అభ్యర్థించారు. దీన్ని పరిశిలిస్తానని బైడెన్ వారికి హామీ ఇచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తన ఓనర్ కార్ పార్కింగ్ చేసిన కుక్క.. చూస్తే పక్కా షాక్ అవుతారు..! ( వీడియో )

Viral Video: చిరుత, పైథాన్ మధ్య జరిగిన భీకర పోరు లో విజేత ఎవరో తెలుసా…?? ( వీడియో )