Viral Video: ఒక్కసారిగా సముద్రమంతా కల్లోలం.. రాకాసి అలల ధాటికి సముద్రంలో జారి పడిన చిన్నారి! అంతలోనే

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డెవాన్‌లోని వాటర్‌ఫ్రంట్ వద్ద కొందరు ఆడుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పీర్ స్లిప్‌వేపై నలుగురు పిల్లలు ఆడుకోవడం కనిపిస్తుంది. అయితే ఊహించని విధంగా ఒక బలమైన కెరటం వాళ్లను తాకడంతో పిల్లల్లో ఓ బాలిక బ్యాలెన్స్ కోల్పోయి రైలింగ్‌ల మధ్య నుంచి నీళ్లలో పడిపోతుంది. అలలు బాలికను సముద్రంలోకి లాక్కుపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఒక్కసారిగా సముద్ర అలల ఉధృతి పెరగడంతో బాలిక ఎంత ప్రయత్నించినా వాటర్ ఫ్రంట్ వద్దకు చేరుకోలేక పోతుంది. ఆమెను కాపాడటానికి ధైర్యంగా..

Viral Video: ఒక్కసారిగా సముద్రమంతా కల్లోలం.. రాకాసి అలల ధాటికి సముద్రంలో జారి పడిన చిన్నారి! అంతలోనే
Girl Swept Out To Sea

Updated on: Aug 10, 2023 | 2:47 PM

లండన్‌, ఆగస్టు 10: సముద్రం ఒడ్డున ఏర్పాటు చేసిన వాటర్‌ ఫ్రంట్ వద్ద సరదాగా  ఆడుకుంటున్న పిల్లలపై ఒక్కసారిగా సముద్రం విరుచుకు పడింది. రాక్షస అలలు ఎగసి పడటం మొదలుపెట్టాయి. తేరుకునేలోపు ఓ బాలికను సముద్రంలోనికి అలలు లాగేసుకున్నాయి. అలల ధాటికి అల్లాడిపోతున్న బాలికను చివరికి ఓ వ్యక్తి ఎలాగోలా ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ షాకింగ్‌ ఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందంటే..

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డెవాన్‌లోని వాటర్‌ఫ్రంట్ వద్ద కొందరు ఆడుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పీర్ స్లిప్‌వేపై నలుగురు పిల్లలు ఆడుకోవడం కనిపిస్తుంది. అయితే ఊహించని విధంగా ఒక బలమైన కెరటం వాళ్లను తాకడంతో పిల్లల్లో ఓ బాలిక బ్యాలెన్స్ కోల్పోయి రైలింగ్‌ల మధ్య నుంచి నీళ్లలో పడిపోతుంది. అలలు బాలికను సముద్రంలోకి లాక్కుపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఒక్కసారిగా సముద్ర అలల ఉధృతి పెరగడంతో బాలిక ఎంత ప్రయత్నించినా వాటర్ ఫ్రంట్ వద్దకు చేరుకోలేక పోతుంది. ఆమెను కాపాడటానికి ధైర్యంగా పోరాడిన ఓ వ్యక్తి చివరికి ఆమెను రక్షించాడు. చిన్నపాటి గాయాలతో బాలిక బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియోను నార్త్ డెవాన్ కౌన్సిల్ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. సముద్రం అలలు అధికంగా ఉన్నసమయంలో జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. సముద్ర పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి దయచేసి తీరం వెంబడి జాగ్రత్త వహించండి అంటూ తన పోస్టులో కౌన్సిల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంఘటన ఆగస్ట్ 3వ తేదీ రాత్రి 7 గంటలకు ఇల్‌ఫ్రాకోంబ్ హార్బర్‌లో జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.