Did you charge your friends for food: బంధువులు, సన్నిహితులు ఒకరినొకరు డిన్నర్ పార్టీ (dinner party)లకు ఆహ్వానాలు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. ఇక పార్టీల్లో సరిగ్గా తినకపోయినా, మొహమాటపడుతున్న వాళ్లకు ఇష్టమైన వంటకాలన్నీ దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి మరీ తినిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ (Friends) ఐతే సరేసరి. ముందురోజు నుంచే వాళ్లకు ఇష్టమైన వంటకాలన్నీ వండటంలో బిజీ బిజీ అయిపోతారు. సరదాగా మట్లాడుకుంటూ విందారగిస్తారు. ఐతే తిన్న తిండికి డబ్బులు కట్టమని మిమ్మల్ని ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అడిగారా? అటువంటి వింత అనుభవం ఓ యువతికి ఎదురైంది. తన స్నేహితురాలు ఇంటికి పార్టీకి పలిచి, అనంతరం తిన్నవాటన్నింటికీ డబ్బులుకట్టమని అడగటంతో ఖంగు తింది. అసలేం జరిగిందంటే..
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అంబర్ నెల్సన్ అనే యువతి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. గత వారం తన స్నేహితురాలింటికి డిన్నర్ పార్టీకి వెళ్లానని, డిన్నర్ అయ్యాక తిన్న వాటికి రూ.1500ల రూపాయలు చెల్లించమని తన స్నేహితురాలు అడిగిందట. షాక్‌కు గురైన సదరు యువతి వారడిగినంత బిల్లు చెల్లించిందట కూడా. ఐతే ఇప్పటివరకూ వాళ్లతో మాట్లాడలేదని, ఈ సంఘటన తనను చాలా బాధపెట్టిందని, ఇది పద్ధతేనా? మీకు ఎప్పుడైనా ఇటువంటి అనుభం ఎదురైందా.. అంటూ ట్వీట్ చేసింది. ఈ విధమైన ప్రవర్తన వల్ల భవిష్యత్తులో ఎవరింటికీ పార్టీలకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. అంబర్ నెల్సన్ ట్వీట్‌కు వేలాది కామెంట్లు, లైకులు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి కొందరైతే తమ జీవితాల్లో కూడా ఇటువంటి సంఘటనలను ఎదుర్కొన్నట్లు కామెంట్ల రూపంలో తెలియజేశారు. పార్టీలో పీతలతో చేసిన వంటకాన్ని (Lobster dish) తిన్నందుకు 75 డాలర్లను చెల్లించానని ఒకరు, తన స్నేహితురాలి మ్యారేజ్ రిసెప్షన్‌కు వెళ్లినవారందరికీ (కుటుంబ సభ్యులతో సహా) బిల్లులు చేతిలో పెట్టారని మరొకరు కామెంట్ చేశారు. మేము కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాం అని వేల మంది చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ పార్టీకి పిలిచి డబ్బు వసూలు చేసే ఘటికులు కూడా ఉంటారు. మీ ఫ్రెండ్స్ లిస్టులో అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త ఇటువంటి వాళ్లతో ఆచితూచి వ్యవహరించడం బెటర్!
Got invited to someone’s place for dinner and they charged me for it….this is weird, right?
— Amber Nelson (@AmberSmelson) March 10, 2022
Got invited to someone’s place for dinner and they charged me for it….this is weird, right?
— Amber Nelson (@AmberSmelson) March 10, 2022
Also Read: