Covid-19: పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు.. ఆ దేశం భారత్‌ సహా 15 దేశాల అంతర్జాతీయ విమానాలపై నిషేధం

|

May 23, 2022 | 5:33 PM

Covid-19: కోవిడ్‌ కేసులు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. భారత్‌లో కేసులు తక్కువగా నమోదు అవుతున్నా.. ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన ..

Covid-19: పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు.. ఆ దేశం భారత్‌ సహా 15 దేశాల అంతర్జాతీయ విమానాలపై నిషేధం
Follow us on

Covid-19: కోవిడ్‌ కేసులు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. భారత్‌లో కేసులు తక్కువగా నమోదు అవుతున్నా.. ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా విజృభించకుండా సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సమా 15 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే లెబనాన్‌, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్, లిబియా సహ పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండగా, మరో వైపు కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జీరో కేసుల దిశగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఆంక్షలు విధిస్తున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించింది.

ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాప్తి తక్కువగా ఉన్నా.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి అబ్దుల్లా అసిరి చెబుతున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా మంకీ పాక్స్‌, కోవిడ్ కేసులు అధికంగా ఉన్న దేశాల నుంచి ప్రయాణాలపై నిషేధం విధించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి