అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన సౌదీ అరేబియా.. యూకేలో కొత్తరకం కరోనా ఎఫెక్టే కారణమా?

|

Dec 21, 2020 | 6:00 PM

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి లండన్‌

అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన సౌదీ అరేబియా.. యూకేలో కొత్తరకం కరోనా ఎఫెక్టే కారణమా?
Follow us on

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి లండన్‌ నగరంతో పాటుగా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉన్నపలంగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న క్రిస్మస్ ఫెస్టివల్ఉండటంతో ప్రజలు లాక్‌డౌన్ విధించడం వల్ల తీవ్ర 6543నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. అత్యవసర సందర్భాల్లో తప్ప అన్ని విదేశీ విమానాలను ఒక వారం పాటు నిషేధిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అంతేకాకుండా జల, భూ మార్గాల ద్వారా ప్రవేశాలను కూడా సౌదీ నిషేధించింది. పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని మరోవారం పాటు పొడగించే అవకాశముందని సౌదీ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. ఇక సౌదీ పొరుగు దేశం కువైట్‌ కూడా బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కెనడా ప్రభుత్వం కూడా యూకేకు రాకపోకలు నిలిపివేసింది.