AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణాతి దారుణం.. ఆన్‌లైన్ ప్రేక్షకుడి సవాల్.. 1300 డాలర్ల పందెం కోసం ప్రేయసి ప్రాణాలను గాల్లో కలిపేసిన ప్రియుడు..

అతనో యూట్యూబర్. ఆస్తికరమైన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతూ అందరిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అతనికి ఓ ప్రేయసి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. రోజూలాగే ఆ యూట్యూబర్.. లైవ్ ఆన్ చేశాడు. నెటిజన్లను పలకరించాడు.

దారుణాతి దారుణం.. ఆన్‌లైన్ ప్రేక్షకుడి సవాల్.. 1300 డాలర్ల పందెం కోసం ప్రేయసి ప్రాణాలను గాల్లో కలిపేసిన ప్రియుడు..
Shiva Prajapati
|

Updated on: Dec 13, 2020 | 6:02 PM

Share

అతనో యూట్యూబర్. ఆస్తికరమైన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతూ అందరిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అతనికి ఓ ప్రేయసి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. రోజూలాగే ఆ యూట్యూబర్.. లైవ్ ఆన్ చేశాడు. నెటిజన్లను పలకరించాడు. ఆ సందర్భంగా ఓ ప్రేక్షకుడు యూట్యూబర్‌కు ఛాలెంజ్ విసిరాడు. తాను చెప్పిన పని చేస్తే 1300 డాలర్లు(భారత కరెన్సీలో రూ.96వేలు) ఇస్తానంటూ సవాల్ విసిరాడు. అయితే ఆ ఛాలెంజ్ అతని ప్రేయసి ప్రాణాలను తీయడమే కాకుండా.. అతన్ని ఊచలు లెక్కబెట్టించింది. ఇంతకీ ఏంటా ఛాలెంట్.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

రష్యాకు చెందిన యూట్యూబర్ స్టాస్ రీప్లే. అతనికి ప్రేయసి వాలంటీనా గ్రిగర్‌యేవా ఉంది. వీరిద్దరూ యూట్యూబ్‌లో అప్పుడప్పుడూ వీడియోలు పెట్టడంతో పాటు, లైవ్‌లో వీక్షకులకు పలకరిస్తుంటారు. ఈక్రమంలోనే తన ప్రేయసితో కలిసి యూట్యూబ్ లైవ్‌లోకి వచ్చాడు స్టాస్ రీప్లే. ఇద్దరూ కలిసి నెటిజన్లను పలకరించారు. అంతా బాగానే ఉన్న సమయంలో ఓ వీక్షకుడు స్టాస్ రీప్లేకి ఒక సవాల్ విసిరాడు. తన ప్రేయసిని శరీరంపై దస్తులు లేకుండా కొంత సమయం పాటు గది బయట నిల్చోబెట్టాలని ఛాలెంజ్ చేశాడు. అలా చేస్తే 1300 డాలర్లు ఇస్తానని పందెం కాశాడు. దానికి టెంప్ట్ అయిన స్టాస్ రీప్లే.. తన ప్రేయసిని బలవంతంగా బాల్కానీలోకి నెట్టి లోపలి నుండి గడియ పెట్టుకున్నాడు. అయితే బయట గడ్డకట్టేంత చలి ఉంది. శరీరంపై బికినీ తప్ప ఎలాంటి దుస్తులు లేని వాలంటీనా తీవ్రమైన చలికి అల్లాడిపోయింది. గది తలుపులు తెరవాలని ప్రియుణ్ణి వేడుకుంది. అయినా అతను పట్టించుకోకపోవడంతో 15 నిమిషాల పాటు నరకం అనుభవించిన వాలంటీనా బాల్కనీలో కుప్పకూలిపోయింది. కొద్దిసేపటి తరువాత స్టాస్ రీప్లే గది తలుపులు తెరిచి చూడగా వాలంటీనా కింద పడిపోయి ఉండటాన్ని గనించాడు. ఆమెను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు విడిచింది. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. వాలంటీనా ఆ సమయంలో గర్భవతి. కాగా, స్టాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్