Yevgeny Prigozhin: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ సహా మరో 10 మంది దుర్మరణం..!

|

Aug 24, 2023 | 12:09 AM

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్‌పైనే తిరుగుబావుటా ఎగరేసిన రష్యన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ ఛీఫ్ ప్రిగోజిన్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ఆయన చనిపోయారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయనే కాక మరో 10 మంది కూడా మరణించారని రష్యా ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.

Yevgeny Prigozhin: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ సహా మరో 10 మంది దుర్మరణం..!
Yevgeny Prigozhin And Vladimar Putin
Follow us on

Yevgeny Prigozhin: రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్‌పైనే తిరుగుబావుటా ఎగరేసిన రష్యన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ ఛీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ దుర్మరణం చెందారు. బుధవారం ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో అందులో ఉన్న మొత్తం 10 మంది మరణించారని అమెరికాకు చెందిన అసోసియేషన్ ప్రెస్ తెలిపింది. అయితే మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళుతున్న ఈ విమానంలో ప్రిగోజిన్ నిజంగా ఉన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. చానల్ కూలిన విమానం ప్రిగోజిన్ బృందానికి చెందినదేనని, పదేపదే బెలారస్‌కు వెళ్లిందని రష్యన్ మిలటరీ అనుకూల చానల్ ‘మిలిటరీ ఇన్‌ఫార్మాంట్’ పేర్కొంది.

కాగా వాగ్నర్ గ్రూప్, రష్యా రక్షణ శాఖ మధ్య ఉద్రిక్తతల పెరిగిన నాటి నుంచి ఈ గ్రూప్ భవిష్యత్తు అస్పష్టంగా మారింది. తూర్పు ఉక్రెయిన్‌లోని వాగ్నర్ శిబిరాలపై రష్యా దళాలు దాడి చేశాయని, డజన్ల కొద్దీ గ్రూప్ మనుషులను చంపేశారని ప్రిగోజిన్ అప్పట్లో పుతిన్ ప్రభుత్వాన్ని ఆరోపించారు. అలాగే ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ దళాలు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టి రష్యాలోకి ప్రవేశించడమే కాక రష్యన్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా పుతిన్‌ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఖరాఖండీగా చెప్పారు

ఇవి కూడా చదవండి

సంఘటనా స్థలం దృశ్యాలు..

అయితే బెలారసియన్ నాయకుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో.. రష్యా లోపల కదలికలను నిలిపివేయడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్యలు తీసుకోవడానికి తాను అంగీకరించినట్లు ప్రిగోజిన్ ప్రకటించారు. ఇలా వెనక్కి తగ్గిన ప్రిగోజిన్ తిరుగుబాటుకు బ్రేక్ పడింది.

విమాన మంటలు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..