Russian Flight Crash: టేకాఫ్‌ సమయంలో కుప్పకూలిన సైనిక విమానం.. 15 మంది దుర్మరణం

|

Mar 13, 2024 | 5:45 PM

పశ్చిమ రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్‌-76 రవాణా విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో మంగళవారం (మార్చి 12) కుప్పకూలింది. రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవో ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది కాగా, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు..

Russian Flight Crash: టేకాఫ్‌ సమయంలో కుప్పకూలిన సైనిక విమానం.. 15 మంది దుర్మరణం
Russian Military Transport Plane Crash
Follow us on

మాస్కో, మార్చి 13: పశ్చిమ రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్‌-76 రవాణా విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో మంగళవారం (మార్చి 12) కుప్పకూలింది. రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవో ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది కాగా, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

మంగళవారం రాత్రి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాడాన్ని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన పరిశోధకుల బృందం ఇవనోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్లు తెలిపింది. ఇవానోవో గవర్నర్ స్టానిస్లావ్ వోస్క్రెసెన్స్కీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. టేకాఫ్‌ సమయంలో ఇంజన్‌లో మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని రక్షణ శాఖ ప్రకటించింది. విమానం కిందికి దిగుతున్నప్పుడు ఒక ఇంజన్‌ నుంచి మంటలు రావడానికి సంబంధించిన వీడియోను రష్యన్‌ మీడియా ప్రసారం చేసింది. నాలుగు-ఇంజిన్ ఐఎల్‌-76 సైనిక విమానంలో నాలుగు ఇంజన్లు ఉంటాయి. ఇది హెవీ-లిఫ్ట్ రవాణా విమానం. ఇది 1970ల నుంచి సోవియట్, ఆ తర్వాత రష్యా వైమానిక దళం ఈ విమానాన్ని వినియోగించారు.

కాగా గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఉక్రేనియన్ డ్రోన్‌ల ద్వారా రష్యాపై వరుస దాడులు చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం మీడియాకు తెల్పింది. ఇక అదే రోజు కార్గో విమానం క్రాష్ అవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో పలుమార్లు ఉక్రేనియన్ డ్రోన్లు రష్యాలోని కొన్ని సైనిక వైమానిక స్థావరాలను పేల్చివేశాయి. ఉక్రెయిన్‌తో యుధ్ధం నేపథ్యంలో రష్యా సైనిక విమానాల సంఖ్య బాగా పెరగడంతోపాటు క్రాష్‌ల సంఖ్య కూడా పెరిగిందని సైనిక నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.