Russia Ukraine War: రష్యా దళాల నుంచి రక్షించండి.. భారీ ఆయుధాలను అందించండి..మిత్రదేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడి విజ్ఞప్తి
ఉక్రెయిన్, రష్యాల మధ్య 53వ రోజు భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. చాలా నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అదే రష్యా దాడికి మారియుపోల్ రక్తమోడింది.
ఉక్రెయిన్, రష్యాల మధ్య 53వ రోజు భీకర పోరు(Russia Ukraine War) కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. చాలా నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అదే రష్యా దాడికి మారియుపోల్ రక్తమోడింది. మారియుపోల్‌లో పరిస్థితి “అమానవీయమైనది” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం అన్నారు. రష్యా దళాల నుంచి నగరాన్ని రక్షించడానికి భారీ ఆయుధాలను అందించాలని జెలెన్స్కీ మరోసారి తన మిత్రులకు విజ్ఞప్తి చేశాడు. ఆయుధాలు అందించడానికి లేదా శాంతి దిశగా తదుపరి చర్చలకు రష్యాను బలవంతం చేయడానికి ఇతర దేశాల నాయకులను వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
భారీ ఆయుధాల ఇవ్వండి.. మిత్ర దేశాలకు జెలెన్స్కీ..
దాడి జరిగిన తొలినాళ్ల నుంచి రష్యా దళాలు మారియుపోల్‌లో దిగ్బంధనాన్ని కొనసాగించాయి. రష్యా దళాలను ఎదుర్కోవడానికి తక్షణమే భారీ ఆయుధాలను అందించాలని అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్రదేశాలను కోరారు. నగర నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో చిక్కుకున్న పౌరులు ఆకలి, దాహంతో అలమటిస్తున్నారు. ఈ యుద్ధానికి పౌరులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. షెల్లింగ్‌తో నాశనమైన ప్రాంతాల్లో గృహాలను పునర్నిర్మించడానికి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ జరుగుతోందని జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్లు వారి పాశ్చాత్య మద్దతుదారులకు ప్రతిస్పందిస్తూ రష్యా దళాలు శనివారం కైవ్ , దాని పరిసర ప్రాంతాలలో దాడులను తీవ్రతరం చేయడంతో ఈ ప్రకటన వెలువడింది.
కైవ్, మారియుపోల్ సహా అనేక నగరాలు రక్తసిక్తం
శనివారం, రష్యా దళాలు కైవ్‌ను విడిచిపెట్టిన పది రోజుల తర్వాత, ఉక్రెయిన్ రాజధాని మళ్లీ దాడులతో అతలాకుతలమైంది. మీడియా నివేదికల ప్రకారం, కైవ్‌కు తూర్పు భాగమైన డార్నిట్స్కీలో రష్యా సైన్యం అనేక పేలుళ్లను నిర్వహించింది. రష్యా దళాలు రాజధాని కైవ్‌తో సహా కనీసం ఎనిమిది నగరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల కారణంగా అనేక మంది అమాయక పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 24 నుండి సైనిక చర్యలు క్రమం నుంచి రష్యన్ సైనికులు ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలియజేస్తాము.
ఇవి కూడా చదవండి: TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు