Russia-Ukraine War: రష్యాకు షాకిచ్చిన టెక్ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ..!

|

Mar 05, 2022 | 1:00 PM

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకరపోరు కొనసాగిస్తోంది. రష్యా దాడులపై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది...

Russia-Ukraine War: రష్యాకు షాకిచ్చిన టెక్ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ..!
Follow us on

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకరపోరు కొనసాగిస్తోంది. రష్యా దాడులపై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా రష్యాకు షాకిస్తున్నాయి. రష్యాకు తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్‌ (Microsoft), ఆపిల్‌ (Apple)తో పాటు ఇతర టెక్‌ దిగ్గజాలు కూడా రష్యా దేశంలో తమ అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక తాజాగా దక్షిణ కోరియా దిగ్గజం శాంసంగ్‌ (Samsung) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి శాంసంగ్‌ ప్రకటన విడుదల చేసింది. ఇక ఉక్రెయిన్‌పై మానవతా దృక్పధంతో కంపెనీ 6 మిలియన్ల డాలర్ల విరాళం ప్రకటించింది.

ఇక రష్యాలో ఆపిల్‌ కంపెనీ ఉత్పత్తుల విషయంలో అమెరికన్‌ టెక్నాలజీ  కూడాసంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సైనిక దాడి కొనసాగతున్న నేపథ్యంలో రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆపిల్‌ (Apple) ప్రకటించింది. రష్యాలో అన్ని ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్‌ కంపెనీ రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తోంది. అమెరికా నేతృత్వంలోని పలు దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. ఇక కెనడా, స్వీడన్‌ కూడా రష్యా నుంచి బయలుదేరే విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. రష్యాను ఒంటరిగా చేయడానికి పాశ్చాత్య మిత్రదేశాలు సమిష్టిగా ఆర్థిక ఆంక్షలు విధించాలని డిసైడ్‌ అయ్యాయి. ఈ చర్యల కారణంగా విదేశీ కరెన్సీ నిల్వలను స్తంభింపజేశాయి. ఇలా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చిన రష్యా.. వారి కోసం ఐదు గంటల పాటు కాల్పల విరామం

Russia-Ukraine: ఐరాసలో మాస్కో రాయబారి కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో 3,189 మంది భారతీయులు

Russia Ukraine War: మిస్సైల్స్‌ కలకలం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌..