Russia Ukraine War: కృత్రిమ వరదలను సృష్టించిన ఉక్రెయిన్.. రష్యా సైన్యం దూకుడుకు బ్రేక్.. ఎలా చేశారో తెలుసా..

|

May 16, 2022 | 4:07 PM

రష్యా సైన్యం దేశ రాజధాని కైవ్‌కు ఉత్తరాన ఉన్న ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రాంతంలో వరదల కారణంగా అది సాద్యం అవ్వడం లేదు. వరదల..

Russia Ukraine War: కృత్రిమ వరదలను సృష్టించిన ఉక్రెయిన్.. రష్యా సైన్యం దూకుడుకు బ్రేక్.. ఎలా చేశారో తెలుసా..
Russia Ukraine War Flood Pr
Follow us on

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించడంలో నిమగ్నమై ఉన్నారు. రష్యా సైన్యం దేశ రాజధాని కైవ్‌కు ఉత్తరాన ఉన్న ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రాంతంలో వరదల కారణంగా అది సాద్యం అవ్వడం లేదు. వరదల కారణంగా.. చిన్న గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనికుల ప్రణాళికకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఉక్రెయిన్  సైన్యం డెమిడివ్‌లో యుద్ధం ప్రారంభమైన సమయంలో ఒక ఆనకట్ట గేట్లను తెరిచింది. ఇర్పిన్ నది గ్రామాన్ని, చుట్టుపక్కల వందల ఎకరాల భూమిని ముంచెత్తింది.

వరదలు రావడంతో..

ఇర్పిన్ నది చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. రష్యా సైనికులు వారి ట్యాంకులను ఈ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. వరదల కారణంగా ఆ ప్రాంతంలో రష్యా సైనికులకు ఇబ్బందిగా మారింది. చుట్టుపక్కల పొలాలు నీటమునిగాయి. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా వరద ముంపునకు గురికావడంతో గ్రామంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రష్యన్ సైనికుల దాడి నుండి రక్షించడానికి డ్యామ్ తెరవబడింది

వరదల వల్ల ఇబ్బందులు పెరిగాయని అయితే రష్యా సైనికుల నుంచి తమను అవే కాపాడిందని స్థానికులు చెబుతున్నారు. విశేషమేమిటంటే, 24 ఫిబ్రవరి 2022న, రష్యా ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. అప్పటి నుంచి రష్యా దళాలు నిరంతరం ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలను లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నాయి. లక్షలాది మంది దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, యుక్రెయిన్ నుండి ఇప్పటివరకు 6 మిలియన్లకు పైగా పౌరులు యుద్ధం మధ్యలో దేశం విడిచిపెట్టారు.