Russia-Ukraine Conflict: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం పరిణామాల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ సంచలన కామెంట్స్ చేశారు. చైనా అధినేత జిన్‌పింగ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలను జిన్‌పింగ్ ఆనందిస్తూ పరిశీలిస్తున్నారని అన్నారు. దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో తైవాన్‌ను చైనా ఆక్రమించేందుకు సిద్ధంగా ఉందని, చైనా టార్గెట్ తైవానే అని అన్నారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంఫ్.. యూనైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తుందో చైనా తదేకంగా పరిశీలిస్తోందని వ్యాఖ్యానినంచారు ట్రంప్.
‘చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్.. అత్యధిక స్థాయిలో సమాచార వ్యవస్థ కలిగిన వ్యక్తి. ఆప్ఘనిస్తాన్‌లో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో గమనించాడు. ఆఫ్ఘనిస్తాన్‌ను నాటో దళాలు విడిచివెళ్లిన మార్గాన్ని కూడా పరిశీలించాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది అమెరికన్ పౌరులు ఉండిపోయారు. ఈ పరిణామాలను కూడా జిన్‌పింగ్ గమనిస్తున్నాడు. ఈ పరిణామాలన్నింటి తనకు అనుకూలంగా మార్చుకుని.. తాను చేయాలనుకుంటున్న పనని చేస్తాడు.’’ అని జిన్‌పింగ్ స్ట్రాటజీని వివరిస్తూ.. బైడెన్ విధానాలను తూర్పారబట్టారు ట్రంప్.
ఉక్రెయిన్ సైన్యంపై ప్రశంసలు..
ఇదిలాఉంటే.. ఉక్రెయిన్ పోరాటంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. రష్యాపై ఉక్రెయిన్ అద్భుతంగా పోరాడుతోందన్నారు. అనుకున్నదానికంటే మెరుగ్గా శక్తిని మించి పోరాడుతోందన్నారు. తన ప్రభుత్వ హయాంలో రష్యా ఇలాంటి యుద్ధానికి సాహసించలేకపోయిందని వ్యాఖ్యానించారు ట్రంప్. ‘‘రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. నేను ఇప్పుడు గనుక అధ్యక్షుడిగా ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. నేనుంటే పుతిన్ ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయడు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకుల నిరోధక క్షిపణులను భారీ స్థాయిలో అందించారు. బిడెన్ చాలా తక్కువ సంఖ్యలో రక్షణ సామాగ్రిని అందించారు. ఒబామా అయితే ఉక్రేయినియన్లకు దుప్పట్లు ఇచ్చారు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైన సమయంలో ట్రంప్.. పుతిన్‌పై ప్రశంసలు గుప్పించారు. అయితే, ఈ కామెంట్స్ రిపబ్లికన్లలోని ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే.. ట్రంప్ తాజాగా తన గేర్ మార్చారు. పుతిన్‌పై ప్రశంసలు చేయకుండా, విమర్శలు చేయకుండా న్యూట్రల్‌గా ఉంటూ వస్తున్నారు. కాగా, ఇటీవలి కాలం నుంచి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు ట్రంప్. యుద్ధాకాల వీరత్వాన్ని జెలెన్‌స్కీలో చూశానని అన్నారు. ‘‘నేను చాలా మందికి చెప్పాను. జెలెన్‌స్కీ పోరాటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.’’ అని చెప్పుకొచ్చారు ట్రంప్.
Also read:
Big News Big Debate Live: తీర్పు- ఓదార్పు..!మూడు రాజధానుల ముచ్చట ముగిసినట్లేనా? (వీడియో)
Andhra Pradesh: శివరాత్రి వేళ వింత జాతర.. రోడ్డుపై పడుకుని తొక్కించుకుంటే కష్టాలు పోతాయట..!