Russia: మహిళలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంపరాఫర్‌.. 10 మంది పిల్లల్ని కంటే రూ. 13 లక్షల నజరానా.. ఎందుకంటే..

|

Aug 19, 2022 | 7:43 AM

Russia: మొన్నటి వరకు ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో వార్తల్లో నిలిచిన రష్యా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 'మదర్‌ హీరోయిన్‌' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించారు...

Russia: మహిళలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంపరాఫర్‌.. 10 మంది పిల్లల్ని కంటే రూ. 13 లక్షల నజరానా.. ఎందుకంటే..
Russia
Follow us on

Russia: మొన్నటి వరకు ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో వార్తల్లో నిలిచిన రష్యా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘మదర్‌ హీరోయిన్‌’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించారు. రష్యా మహిళలు ఎవరైతే 10 మంది చిన్నారులకు జన్మనిస్తే వారికి రూ. 13 లక్షల నజరానా ఇస్తామని పుతిన్‌ ప్రకటించారు. పిల్లల్ని కంటే డబ్బులు ఇవ్వడం ఏంటి.? అసలు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చారనేగా మీ సందేహం అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఒకప్పుడు దేశాలు విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనాభాను పెంచడానికి చర్యలు చేపట్టే రోజులు వచ్చాయి. ఇందులో భాగంగానే తాజాగా రష్యా అధ్యక్షుడు ఈ ‘మదర్‌ హీరోయిన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతకొన్నేళ్లుగా రష్యా జనాభా భారీగా తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఇటీవల జరిగిన ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వేలాది మంది సైన్యా్న్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతేనా కరోనా కారణంగా కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో జనాభాను పెంచాలని ఫిక్స్ అయిన పుతిన్‌.. మదర్‌ హీరోయిన్‌ పథకానికి నాంది పలికారు.

అసలేంటీ పథకం..

మదర్‌ హీరోయిన్‌ పథకం కింద రష్యాకు చెందిన మహిళ పది మందికి జన్మనిస్తే వారికి రూ. 13 లక్షల రూపాయలతో పాటు తర్వాత వారి పెంపకానికి అవసరమైన మొత్తాన్ని అందిస్తారు. 10వ సంతనం కలిగిన తర్వాత ఈ మొత్తాన్ని తల్లికి అందిస్తారు. అయితే ఇక్కడ ఒక కండిషన్‌ ఉంది. అదేందంటే.. 10వ బిడ్డ జన్మించే సమయానికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలనే షరతు పెట్టారు. ఈ పథకం ద్వారా రష్యాలో మహిళలు ఎక్కువ మందిని కనేందుకు ఆసక్తి చూపుతారని, దీనివల్ల రష్యా జనాభా పెరుగుతుందని అక్కడి రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..