Russia Ukraine War: మిస్సైల్స్‌ కలకలం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌..

|

Mar 05, 2022 | 8:34 AM

Russia Ukraine War:  ఉక్రెయిన్‌- రష్యా దేశాల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా పంజా విసురుతోంది. దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తుండటంతో..

Russia Ukraine War: మిస్సైల్స్‌ కలకలం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌..
Follow us on

Russia Ukraine War: ఉక్రెయిన్‌- రష్యా దేశాల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా పంజా విసురుతోంది. దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తుండటంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోంది. నిన్న అణు విద్యుత్‌ ప్లాంట్‌పై రష్యా దాడి చేయడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్‌లోని కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌ గుర్తించినట్లు జెలెన్‌స్కీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే శనివారం తెల్లవారుజామున ఖార్కివ్‌లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నాటో దేశాల సాయంతో ఉక్రెయిన్‌ రష్యాపై విరుచుకుపడుతోంది. కీవ్‌ సహా ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది రష్యా.

రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరింది. ఎక్కడచూసినా రక్తపు మడుగులు, గాయాలతో అల్లాడుతున్నవారు. శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు వేరే ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇరు దేశాల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నప్పటికీ పుతిన్.. ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. షెల్స్‌, బాంబులతో ఉక్రెయిన్‌ నగరాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో బరోద్యాంకా, డొనెట్స్‌ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులతోపాటు వందలాది మంది ప్రజలు సైతం దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు చాలామంది గాయాలపాలయ్యారు. చికిత్స అందక అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

కాగా.. రష్యా ఉక్రెయిన్‌పై అణుబాంబు వెయ్యకపోయినా, అలాంటి విధ్వంసానికే ఆరంభం పలికింది. దేశానికి 40శాతం న్యూక్లియర్‌ పవర్‌ను అందిస్తున్న జఫ్రోజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. ఈ క్రమంలో మూడోసారి కూడా బెలారస్‌ బ్రెస్ట్‌ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ప్రధాన పట్టణాలపై ఫోకస్‌ చేసిన రష్యన్‌ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. యుద్ధం మొదలైన 8 రోజుల తర్వాత రష్యా సైన్యం ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు బలగాలు దూసుకెళ్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌ను వీడని ఏపీ యువకుడు.. అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు.. కారణం తెలిస్తే షాకవుతారు

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..