రష్యాలో మహిళా జైలు అధికారులకు బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించారు. ఫైనల్ లిస్టులో ఎంపికైన 12 మంది ఫోటోలను రష్యన్ ఫెడరల్ ‘పెన్ టెన్ టియరీ’ అనే అంస్థ రిలీజ్ చేసింది. ‘మిస్ పీనల్ సిస్టం కాంటెస్ట్-2021’ పేరిట ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 100 మంది నుంచి ఈ 12 మందిని సెలక్ట్ చేశారట.. వీరు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను, పంపడమే గాక…..తమ హాబీలను, తమ ప్రాంత అందాలను, ప్రొఫెషన్ గ్లామరస్ గా ఉండాలంటే ఏం చేయాలో. ఎలా వ్యవహరించాలో అన్నీ తెలియ జేయాలట..జైలు యూనిఫారాలతో బాటు తమకు నచ్చిన డ్రెస్సులను కూడా ధరించి ఉండాలట.. విజేతను ఆన్ లైన్ పోల్ ద్వారా ఎంపిక చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది. రష్యా వ్యాప్తంగా గల మహిళా జైలు అధికారులు వీరిలో ఉన్నారు. ఇప్పటికే కొందరు తమ వీడియోలను పంపారు. అయితే ఈ పోటీల పట్ల కొందరు పెదవి విరుస్తున్నారు. మహిళల హక్కులకోసం పోరాడే నస్తాయా కృషి లింకోవా అనే రైట్స్ కాంపెయినర్….వీటిని వ్యతిరేకిస్తోంది.
ఈ పోటీల్లో పాల్గొంటున్నవారిని కేవలం అందాల రాణులుగా ప్రజలు భావిస్తారేమో గానీ.. విధి నిర్వహణ పట్ల వీరి నిబధ్ధతను చూడరని, పైగా విజేతలకు తమ డ్యూటీ పట్ల నిర్లక్ష్యం పెరిగిపోతుందని ఆమె వాదిస్తోంది.అసలు ఈ పోటీలు పూర్తిగా అనుచితం అని ఆమె విమర్శించింది. కానీ ఈ పోటీలను నిర్వహిస్తున్న సంస్థ మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తోంది. మహిళా జైలు అధికారుల్లోనూ సృజనాత్మకత ఉంటుందని, వారిని కేవలం అధికారులుగా కాకుండా వారిలోని కళాభినివేశాన్ని కూడా గుర్తించాలని ఆ సంస్థ అంటోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.
Covid-19 vaccination : టీకా పంపిణీపై సెంట్రల్ స్పెషల్ ఫోకస్ తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.