రష్యాలో భయానక దృశ్యాలు.. జపాన్, అమెరికా సహా అనేక దేశాలకు సునామీ హెచ్చరిక

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో ప్రమాద హెచ్చరికలు మోగాయి. 1952 తర్వాత ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపం అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అనేక తీరప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పారు.

రష్యాలో భయానక దృశ్యాలు.. జపాన్, అమెరికా సహా అనేక దేశాలకు సునామీ హెచ్చరిక
Russia Earthquake

Updated on: Jul 30, 2025 | 9:57 AM

రష్యాలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8 గా ఉంది. ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భవనాలు ఊగిపోయాయి. రష్యా నుంచి వస్తున్న అనేక చిత్రాలు, వీడియోలు అక్కడి భయానక పరిస్థితిని తెలియజేస్తున్నాయి. జపాన్, అమెరికాతో పాటు, న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. కొన్ని చోట్ల కూడా సునామీ ప్రభావం కనిపించడం ప్రారంభమైంది.

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ బుధవారం తెలిపింది. జపాన్‌కు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఉదయం 8:25 గంటలకు భూకంపం సంభవించిందని, దాని తీవ్రత ప్రారంభ తీవ్రత 8.0గా నమోదైందని ఏజెన్సీ తెలిపింది. జపాన్ పసిఫిక్ తీరంలో 1 మీటర్ వరకు సునామీ హెచ్చరికను ఏజెన్సీ జారీ చేసింది. తరువాత దీనిని 8.8కి సవరించారు.

ఇవి కూడా చదవండి

భూకంపానికి సంబంధించిన అనేక భయానక వీడియోలు

రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీకి ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో, 74 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ద్వీపకల్పంలో సంభవించిన ఈ పెద్ద భూకంపంలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి వార్తలు లేవు. కానీ అక్కడి నుంచి వీడియోలు చూస్తే.. భూకంపం సృష్టించిన విధ్వసం చాలా భయానకంగా ఉంది. వీడియోలో చాలా భవనాలు ఊగిపోతున్నాయి. చాలా చోట్ల నష్టం వాటిల్లునట్లు తెలుస్తోంది.

 

రష్యాలో సునామీ అలలు
రష్యా పసిఫిక్ తీరంలోని కమ్చట్కా ప్రాంతాన్ని మొదటి సునామీ అలలు తాకిన ఫోటోలు, వీడియోలు వెలువడ్డాయి. భూకంపం కారణంగా సముద్ర మట్టం గణనీయంగా పెరిగింది. దీని కారణంగా తీరప్రాంత నగరాల భవనాల్లో నీటి మట్టం పెరుగుదల కనిపించింది.

 

జపాన్‌లోని నాలుగు ప్రధాన దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని జపాన్‌కు చెందిన NHK టెలివిజన్ తెలిపింది. అయితే దాని ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. 19.3 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని USGC తెలిపింది. భూకంపం తీవ్రత 8.7గా ఉందని ప్రాథమిక నివేదికల తర్వాత USGC తెలిపింది.

కమ్చట్కాపై దీని ప్రభావం గురించి రష్యా నుంచి సమాచారం లేదు. అలాస్కాకు చెందిన జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం అలాస్కా అలూటియన్ దీవులలోని కొన్ని ప్రాంతాలతో పాటు కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ , హవాయితో సహా పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. పాన్‌హ్యాండిల్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా అలాస్కా తీరప్రాంతంలో ఎక్కువ భాగాన్ని కూడా ఈ హెచ్చరిక కవర్ చేస్తుంది.

న్యూజిలాండ్, ఇండోనేషియాలలో కూడా సునామీ హెచ్చరికలు
రష్యన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత తీరప్రాంతంలో శక్తివంతమైన,పెద్ద అలలు ఎగసిపడతాయని న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) హెచ్చరించిందని ది గార్డియన్ నివేదించింది. అలాంటి అలలు ప్రమాదకరంగా ఉంటాయని, ఈతగాళ్ళు, సర్ఫర్లు, మత్స్యకారులు, తీరప్రాంతాల్లోని లేదా సమీపంలో నివసించే ప్రజలు దూరంగా ఉండాలని ఏజెన్సీ కోరింది.

అదేవిధంగా ఇండోనేషియాలో కూడా సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. బుధవారం మధ్యాహ్నం రష్యా తీరంలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ 0.5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో సునామీ తరంగాలు దేశంలోని కొన్ని ప్రాంతాలను తాకవచ్చని హెచ్చరిక జారీ చేసింది.

కమ్చట్కాలో ఇప్పటికే 9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
పసిఫిక్ మహాసముద్రం సమీపంలో ఉన్న జపాన్ ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి. జూలై ప్రారంభంలో కమ్చట్కా సమీపంలో సముద్రంలో ఐదు ప్రధాన భూకంపాలు సంభవించాయి – వాటిలో అతిపెద్దది 7.4 తీవ్రతతో ఉంది. దాదాపు 2 లక్షల జనాభా కలిగిన పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 20 కిలోమీటర్ల లోతు 144 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద భూకంపం సంభవించింది.

అంతకుముందు నవంబర్ 4, 1952న రష్యాలోని కమ్చట్కాలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. హవాయిలో 9.1 మీటర్ల ఎత్తైన అలలు ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

 

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..