XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రోజులు లెక్కిస్తున్నారా.. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తున్నారా..!
XI Jinping: కరోనా తరువాత చైనా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అక్కడ అధ్యక్ష మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అక్కడి వార్తా కథనాలు కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.
XI Jinping: కరోనా తరువాత చైనా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అక్కడ అధ్యక్ష మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అక్కడి వార్తా కథనాలు కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. చైనా ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పదవి నుంచి తప్పుకోబోతున్నారని(Stepping Down) సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కరోనా మహమ్మారిని నిర్వహించటంలో విఫల్యమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు మరో పక్క చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్‌పింగ్ తీసుకుంటున్న అనేక తప్పుడు నిర్ణయాలు కారణమౌతున్నాయని రూమర్స్ రాజ్యమేలుతున్నాయి. సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం ఊపందుకుంది.
ఈ సమావేశం అనంతరం కెనడాకు చెందిన బ్లాగర్ ఓ వీడియో విడుదల చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. కొద్ది నెలల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని, ఆ లోపే జిన్‌పింగ్‌ను పదివి నుంచి తప్పుకోవాలని ఆదేశించిందని అతడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ చైనా తదుపరి అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని చెప్పాడు. కేవలం పార్టీ నుంచి మాత్రమే కాక.. పదవి నుంచి కూడా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ వైదొలుగుతారని తన వీడియోలో చెప్పుకొచ్చాడు.
కరోనా కట్టడి కోసం జీరో కొవిడ్ పాలసీ పేరుతో జిన్‌పింగ్.. ప్రజలకు కనీవినీ ఎరుగని ఆంక్షలు పెట్టారు. ఇక వ్యాపారాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. చాలా కంపెనీలు లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దివాలా దిశాగా అడుగులు వేస్తున్నాయి. అవి ఆర్థికంగా కుదేలవుతున్నాయి. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ప్రభావితమైంది. చైనా యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 4 శాతం వరకు పడిపోయింది. గత 28 ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్‌పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని జిన్‌పింగ్‌పై విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి..