ఐర్లాండ్ ప్రజలు ఇమ్మిగ్రేషన్ సెంటర్లతో పాటూ బస్సులు, ట్రామ్‌లపై దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లోని వాహనాలు, భవనాలకు నిప్పంటించారు.ఈ సంఘటనలో ఐదు మంది గాయపడ్డారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లిం ఇమ్మిగ్రెంట్ చేసిన కత్తి దాడిలో ఒక చిన్నారి, మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అల్జీరియన్ నుంచి వచ్చిన వలసదారు ఒకరు పొలీస్ కస్టడీలో ఉన్నారు. కానీ అతని మానసిక స్థితి సరిగ్గా లేదంటున్నారు అధికారులు. ఐరిష్ జాతీయులు వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుండి వస్తున్నవారిని ఐరిష్ లిబరల్ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు. దీంతో భారీగా వలసలు పెరగిగాయి. ఇలా వలసలు పెరిగిన కారణంగా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయంటున్నారు ఐరిష్ జాతీయులు.
డబ్లిన్ సిటీ సెంటర్లో జరిగిన అల్లర్లలో బస్సులు, ట్రామ్‌లు తగలబడుతున్నాయి. స్థానికంగా ఉన్న కొన్ని దుకాణాలపై దాడికి ఎగబడి లూటీ చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ప్రారంభమైనట్లు అక్కడి చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కొందరు పేలుడు పదార్థాలతో రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు చుట్టుపక్కల ఉన్న బార్లు, రెస్టారెంట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఐరిష్ పార్లమెంట్ భవనం చుట్టూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఐరిష్ న్యాయ మంత్రి దీనిపై స్పందించారు. ‘ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి వినాశనానికి పాల్పడే పోకిరీలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు’. ఐరిష్ ప్రెసిడెంట్ మైఖేల్ డి హిగ్గిన్స్ మాట్లాడుతూ ‘మా ఆలోచనలు అన్నీ దాడుల్లో గాయపడ్డ పిల్లలు, మహిళలపైనే ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ అల్లర్లను ఖండిస్తున్నామని, ఎవరు చేసేశారో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు’ చేశామన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..