AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏలియన్స్ హెల్ప్ చేశారా ? నిజమేనా ..?

చంద్రునిపై మానవుడు కాలు మోపడానికి గ్రహాంతర జీవులు (ఏలియన్స్) మనకు సహాయం చేశారా ? అవుననే అంటున్నాడో రీసెర్చర్. యుఎఫ్ ఓ లపై పరిశోధనలు జరుపుతున్న స్పాట్ సి.వేరింగ్ అనే ఈయన… నాడు అపోలో 10 మిషన్ సందర్భంగా తీసిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ మిషన్ లోని ఓ నల్లని ఫోటో గ్రహాంతర జీవుల ఉపగ్రహమేనన్నది స్పాట్ వాదన. ఇది ఏలియన్స్ రూపొందించినదేనని, వేలాది సంవత్సరాల క్రితం వారు తయారు చేసిన ఈ శాటిలైట్ […]

ఏలియన్స్  హెల్ప్ చేశారా  ? నిజమేనా ..?
Anil kumar poka
|

Updated on: Jun 09, 2019 | 2:25 PM

Share

చంద్రునిపై మానవుడు కాలు మోపడానికి గ్రహాంతర జీవులు (ఏలియన్స్) మనకు సహాయం చేశారా ? అవుననే అంటున్నాడో రీసెర్చర్. యుఎఫ్ ఓ లపై పరిశోధనలు జరుపుతున్న స్పాట్ సి.వేరింగ్ అనే ఈయన… నాడు అపోలో 10 మిషన్ సందర్భంగా తీసిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ మిషన్ లోని ఓ నల్లని ఫోటో గ్రహాంతర జీవుల ఉపగ్రహమేనన్నది స్పాట్ వాదన. ఇది ఏలియన్స్ రూపొందించినదేనని, వేలాది సంవత్సరాల క్రితం వారు తయారు చేసిన ఈ శాటిలైట్ ని ఏవో కారణాలవల్ల భూ కక్ష్యలో వదిలివేశారని ఆయన చెబుతున్నారు. ఇది శాటిలైట్ కాకపోతే ఆ నల్లని ఇమేజ్ ఏమిటన్నది ఆయన ప్రశ్న. , బహుశా చంద్రునిపై మానవుడు అడుగు పెట్టడానికి అతనికి సాయపడేందుకే వారు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఉంటారని స్కాట్ అభిప్రాయపడుతున్నారు.యుఎస్ ప్రభుత్వానికి వంద శాతం ఏలియన్స్ తో కనెక్షన్ ఉంది. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని ఆయన అంటున్నారు. (అపోలో 11 చంద్రునిపై దిగిందని, ఇది నాసాతో బాటు మానవులు సాధించిన అద్భుత విజయమని అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 1969 జులై 20 న ప్రకటించాడు. ఆ మిషన్ కి ముందే అపోలో 10 ప్రయోగాన్ని నాసా చేపట్టింది). అయితే చంద్ర మండలానికి సంబంధించిన మిషన్ల విషయంలో నాసా ఎన్నో అంశాలను మరుగునపరిచిందని, అందులో ఏలియన్ కనెక్షన్ కూడా ఉందని పలువురు విమర్శిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో స్కాట్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు.. పోలార్ ఆర్బిట్ సమీపంలో ఓ అంతరిక్ష నౌక ఉందని, దీనికి, భూమికి సంబంధం లేదని అంటున్నవారు స్కాట్ తో ఏకీభవిస్తున్నారు. 1990 ప్రాంతం నుంచి ఇలా ఎన్నో థియరీలు బయటికి వచ్చాయి. మానవుల కార్యకలాపాల పర్యవేక్షణకోసం గ్రహాంతర జీవులు ఈ నల్లని ఉపగ్రహాన్ని ఉపయోగించారని ఒకరంటే.. ఏలియన్స్ డీప్ మిషన్ల విషయంలో నాసాతో చేతులు కలిపారని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే నాసా మాత్రం వీటిని ఖండిస్తోంది. నల్లని ఉపగ్రహంలా కనబడుతున్నది అంతరిక్షంలో తేలియాడుతున్న శిథిలవస్తువు తప్ప మరేమీ కాదని ఈ సంస్థ చెబుతోంది. ఏది ఏమైనా, ఏలియన్స్ కి సంబంధించిన ఏ సమాచారం లేదా వార్త అయినా ఎప్పటికప్పుడు సరికొత్త మిస్టరీని సృష్టిస్తోంది.