PM Modi- Elon Musk: నేను మోడీకి పెద్ద అభిమానిని.. త్వరలోనే భారత్‌కు వస్తా: ట్విట్టర్‌ సీఈవో ఎలోన్‌ మస్క్‌

|

Jun 21, 2023 | 7:56 AM

అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్‌ ప్యాలెస్‌లో ఉన్న మోడీతో ట్విట్టర్‌ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌తో భేటీ అయ్యారు.

PM Modi- Elon Musk: నేను మోడీకి పెద్ద అభిమానిని.. త్వరలోనే భారత్‌కు వస్తా: ట్విట్టర్‌ సీఈవో ఎలోన్‌ మస్క్‌
Pm Modi, Elon Musk
Follow us on

అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్‌ ప్యాలెస్‌లో ఉన్న మోడీతో ట్విట్టర్‌ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మస్క్‌ తాను ప్రధాని మోడీకి పెద్ద అభిమాని అని తెలిపారు. త్వరలోనే భారత్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు. ‘భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారత్‌లోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ భారతదేశ అభివృద్ధి గురించి చాలా బాగా శ్రద్ధ వహిస్తారు. ఇక మోడీ పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు. నేను మోడీకి పెద్ద ఫ్యాన్‌ని. మోడీతో అద్భుతమైన సమావేశం జరిగింది. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు రెడీ అవుతున్నా’ అని మస్క్‌ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా స్పేస్‌ఎక్స్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఎలోన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా సహాయపడుతుందన్నారు ట్విట్టర్‌ సీఈవో. ఇక మస్క్‌తో పాటు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత నీల్‌ డి గ్రాస్సే టైసన్‌, నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, రచయిత నికోలస్ నాసిమ్ తలేబ్ తదితరులు మోడీని కలిసిన వారిలో ఉన్నారు

ఇవి కూడా చదవండి

 

&nb

కొవిడ్ పై భారత్ పోరు ప్రశంసనీయం..

ఈ సందర్భంగా నికోలస్ నాసిమ్ తలేబ్ ప్రధానిని కలిసిన తర్వాత మాట్లాడారు. ‘కోవిడ్‌పై భారతదేశం ఎంతో సమర్థవంతంగా పోరాడింది’ అని పేర్కొన్నారు నికోలస్. అలాగే ప్రధాని మోడీతో రిస్క్ టేకింగ్ యాంటీ-ఫ్రాజిలిటీ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..