Donald Trump: అదిరిపోయేలా ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం.. మూడ్రోజులపాటు అదిరిపోయే వేడుకలు

ట్రంప్‌ ఈజ్‌ బౌన్స్‌ బ్యాక్‌... గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌. మరి ఆయన ప్రమాణస్వీకారం అంటే ఎలా ఉండాలి...! నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌ అన్నట్లుగా ఉండాలి కదా..! యస్‌... ఏర్పాట్లు కూడా అదే రేంజ్‌లో చేశారు. నాలుగేళ్ల కష్టం మరిచిపోయేలా... ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ ప్రపంచదేశాలు చూసేలా ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారు. మూడ్రోజులు అద్దరిపోయే ఈవెంట్స్‌ ప్లాన్‌ చేశారు. ప్రమాణస్వీకారం రోజు 11 డిగ్రీల గడ్డకట్టే చలి ఉంటుందని వాతావరణశాఖ అంచనాలు అంచనా వేస్తున్నప్పటికీ... సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లున్నాయ్.

Donald Trump: అదిరిపోయేలా ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం.. మూడ్రోజులపాటు అదిరిపోయే వేడుకలు
Donald Trump Inauguration

Updated on: Jan 19, 2025 | 2:30 PM

2020లో బైడెన్‌ చేతిలో ఓడిపోయిన దగ్గర్నుంచి అహర్నిహలు శ్రమించారు ట్రంప్‌. మళ్లీ అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు. నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డారు. బైడెన్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫైనల్లీ రెండోసారి అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. మరంతటి కష్టాన్ని మరిచిపోయేలా… నెక్ట్స్‌ లెవల్‌ సెలబ్రేషన్స్ ప్లాన్‌ చేశారు. చలిని సైతం లెక్కచేయకుండా ఏర్పాట్లు చేశారు.

ట్రంప్‌ మూడురోజుల ప్రమాణస్వీకార సంబరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫ్లోరిడా నుంచి వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న ట్రంప్‌… ఇప్పటికే నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు చేరుకుని విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ అభిమానులు బాణసంచా కాల్చారు. అదే సమయంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌ వాషింగ్టన్‌లో కేబినెట్‌ సహచరులతో విందులో పాల్గొన్నారు.

ఆదివారం ఆర్లింగ్టన్‌ జాతీయ స్మారకం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు ట్రంప్‌. ఆ తర్వాత వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ వన్‌ ఎరీనా వద్ద జరగనున్న భారీ ర్యాలీకి హాజరవుతారు. ఆ తర్వాత ప్రైవేటు డిన్నర్‌కి అటెండ్‌ అవుతారు. ఇక ప్రమాణ స్వీకారం జరిగే సోమవారంనాడు సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వైట్‌హైజ్‌కి వెళ్లి బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. ఆ తర్వాత క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండాలో అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రారంభోపన్యాసం ఇస్తారు. అయితే.. అతి మంచు కారణంగా 1985 తర్వాత ఇండోర్‌లో అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది.

ప్రమాణస్వీకారం రోజు దేశవ్యాప్తంగా ఈవెంట్స్‌ ప్లాన్‌ చేశారు. ఇటు వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లోనూ సంగీత కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి పలువురు ప్రముఖుల వచ్చి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఫైనల్‌గా 21వ తేదీన వాషింగ్టన్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలతో మూడ్రోజుల వేడుకలు ముగుస్తాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..