Pompeii: ఆ నగరంలో రాళ్లుగా మారిన మనుషులు.. శాపగ్రస్త నగరం నుంచి రాళ్లు తీసుకెళ్తే అన్నీ కష్టలేనట.. రీజన్ ఏమిటంటే

| Edited By: Ravi Kiran

Mar 03, 2024 | 9:00 PM

పాంపీ శాపం గురించి తనకు తెలిసిందని ఆ మహిళ లేఖలో రాసింది. ఈ పురాతన నగరం నుండి వస్తువులను తీసుకుని వెళ్లే వారిని శాపం వెంటాడుతుందని తనకు ఆలస్యంగా తెలిసిందని చెప్పింది. అంతేకాదు ఆ మహిళ ఇంకా రాసింది..  'నిజంగా నాకు శాపం గురించి తెలియదు. ఇక్కడ నుంచి రాళ్లు తీసుకోకూడదని   తెలియదని చెప్పింది.

Pompeii: ఆ నగరంలో రాళ్లుగా మారిన మనుషులు.. శాపగ్రస్త నగరం నుంచి రాళ్లు తీసుకెళ్తే అన్నీ కష్టలేనట.. రీజన్ ఏమిటంటే
Pompeii 'curse' Myth
Follow us on

ప్రపంచంలో అనేక వింతప్రదేశాలు, రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రదేశాల్లో దెయ్యాలున్నాయని.. శాపగ్రమైనవి అని ప్రజల నమ్మకం. కొన్ని శాపగ్రస్తమైన ప్రాంతాల్లో అనేక మిస్టరీ సంఘటనలు నేటికీ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి మిస్టరీ ప్లేస్ లో ఒకటి ఇటలీలో ఉంది. దీనిని పాంపీ అని పిలుస్తారు. పాంపీ ఒక పురాతన రోమన్ నగరం. ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం  ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. లావా ప్రవాహంతో నగరం మొత్తం మునిగిపోయింది. ఆ గ్రామంలో  వారంతా రాయిలా మారిపోయారు. అప్పటి నుంచి ఈ నగరాన్ని శాపగ్రస్త నగరంగా పరిగణిస్తారు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ శాపగ్రస్త నగరం  పాంపీ చాలా విచిత్రమైన సంఘటన కారణంగా వార్తల్లో ఉంది. ఇది ప్రజలను ఆలోచించేలా చేసింది.

వాస్తవానికి తాను పాంపీ నగర సందర్భాన కోసం వెళ్ళినప్పుడు అక్కడ శిథిలాల నుండి తాను రాళ్లను దొంగిలించానని ఒక మహిళ పేర్కొంది. ఆ రాళ్లను ఇంటికి తీసుకుని వెళ్లినప్పటి నుంచి తనకు అనేక విచిత్ర సంఘటనలు ఎదురయ్యాయని పేర్కొంది. దీంతో ఆమె రాళ్లను తిరిగి నగరంలో పెట్టడమే కాదు.. తాను తెలియకుండా తప్పు చేశానని.. క్షమించమంటూ ఓ లెటర్ కూడా రాసింది.

పురావస్తు శాస్త్రవేత్త గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఒక లేఖను పోస్ట్ చేసారు. ఈ ఉత్తరాన్ని పాంపీ నగరంలోని రాళ్లతో పాటు దొరికిందని తెలిపారు. ఈ లెటర్ లో పాంపీ శిథిలాల నుండి రాళ్లను తీసుకుని వెళ్లిన మహిళ క్షమాపణలు చెప్పినట్లు.. తాను ఎందుకు ఈ రాళ్లను తీసుకుని ఇవ్వాలని నిర్ణయించుకున్నానో వెల్లడించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కారణంగా రాళ్లు తిరిగి వచ్చాయి

పాంపీ శాపం గురించి తనకు తెలిసిందని ఆ మహిళ లేఖలో రాసింది. ఈ పురాతన నగరం నుండి వస్తువులను తీసుకుని వెళ్లే వారిని శాపం వెంటాడుతుందని తనకు ఆలస్యంగా తెలిసిందని చెప్పింది. అంతేకాదు ఆ మహిళ ఇంకా రాసింది..  ‘నిజంగా నాకు శాపం గురించి తెలియదు. ఇక్కడ నుంచి రాళ్లు తీసుకోకూడదని   తెలియదని చెప్పింది. తాను రాయిని ఇంటికి తీసుకుని వెళ్లిన ఏడాదిలోపే తాను క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయిందని పేర్కొంది. దీంతో తాను నగరం నుంచి తీసుకుని వెళ్లిన రాళ్లను.. నగరానికి అప్పగించి క్షమాపణ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది ఆ యువతి.

రాళ్లు తీసుకెళ్లి బాధితులుగా మారిన ఎంతో మంది

ఇలా నగరం నుంచి రాళ్లు తీసుకుని వెళ్లి వ్యాధి బారిన పడిన మొదటి మహిళ ఈమె మాత్రమే కాదు. ఇప్పటి వరకూ అనేక మంది ‘పాంపీ శాపం’ బారిన పడ్డారు. రాళ్లను తీసుకుని వెళ్లినప్పటి నుంచి తమను దురదృష్టం వెంటాడుతున్నదంటూ నగర శిథిలాల నుంచి తీసిన కళాఖండాలను కూడా తిరిగి ఇచ్చేశారు. 2005లో కెనడాకు చెందిన ఓ మహిళ కూడా ఇక్కడి నుంచి కొన్ని రాళ్లను తీసుకువెళ్లింది. అనంతరం తాను క్యాన్సర్ బారిన పడినట్లు పేర్కొంది. అంతేకాదు ఆర్థిక సమస్యలు వెంటాడాయని.. దీంతో ఆ కెనడా మహిళ ఆ రాళ్లను తిరిగి ఇచ్చిందట.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..