PM Modi Australia Visit: ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ.. ముందుగా ప్రవాస భారతీయులతోనే భేటి..

|

May 23, 2023 | 7:21 AM

PM Modi Australia Visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా మూడో దేశం, ఇంకా చివరి దశ పర్యటన కోసం సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆస్ట్రేలియా అధికార ప్రతినిధుల నుంచి..

PM Modi Australia Visit: ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ.. ముందుగా ప్రవాస భారతీయులతోనే భేటి..
Pm Modi Australia Visit
Follow us on

PM Modi Australia Visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా మూడో దేశం, ఇంకా చివరి దశ పర్యటన కోసం సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆస్ట్రేలియా అధికార ప్రతినిధుల నుంచి, ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇక ఆ దేశంలో 22-24 తేదీల మధ్య ప్రధాని మోదీ పర్యటించనుండగా.. ముందుగా ఈ రోజు అంటే మంగళవారం ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఇంకా వారిని ఉద్దేశించి ప్రసగించనున్నారు.

అయితే ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2016 జనాభా లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలో 619,164 మంది భారత్‌కి చెందినవారు ఉన్నారు. ఇది ఆస్ట్రేలియన్ జనాభాలో 2.8 శాతం కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఈ 619,164 మందిలో 592,000 మంది భారతదేశంలోనే జన్మించారు. అంటే వారంత ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు. కాగా ప్రధాని మోదీ చివరిసారిగా 2014లో ఆస్ట్రేలియాలో పర్యటించారు.

ఇక సిడ్నీ నగరానికి ప్రధాని మోదీ చేరుకోక ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఓ ప్రకటనలో ‘ఈ ఏడాది ప్రారంభంలో నాకు భారత్‌లో ఘన స్వాగతం లభించిన తర్వాత, ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ అధికారిక పర్యటన కోసం ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం చాలా గౌరవంగా ఉంది. ఆస్ట్రేలియా-భారత్ స్థిరమైన, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ సంబంధాల కోసం నిబద్ధత వహిస్తున్నాయి. ఇందుకోసం మా వంతుగా కీలక పాత్ర పోషిస్తాము’ అని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..