PM Modi in Japan: నేడు జపాన్ మాజీ అబే ప్రధాని అంత్యక్రియలు.. తన స్నేహితుడికి తుదివీడ్కోలు చెప్పేందుకు టోక్యోకు చేరుకున్న ప్రధాని మోడీ

టోక్యోకు బయలుదేరే ముందు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా తాను మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఈ రాత్రికి టోక్యో వెళ్తున్నాను' అని పేర్కొన్నారు. అబే తనకు ప్రియమైన స్నేహితుడని.. 

PM Modi in Japan: నేడు జపాన్ మాజీ అబే ప్రధాని అంత్యక్రియలు.. తన స్నేహితుడికి తుదివీడ్కోలు చెప్పేందుకు టోక్యోకు చేరుకున్న ప్రధాని మోడీ
Pm Modi In Tokyo
Follow us

|

Updated on: Sep 27, 2022 | 10:26 AM

PM Modi in Japan: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన స్నేహితుడైన అబేను కడసారి చూసేందుకు ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. అబే  అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. తన స్నేహితుడికి చివరి వీడ్కోలు చెప్పనున్నారు.  ఇప్పటికే ప్రధాని మోడీ ఆదేశ రాజధాని టోక్యోకి చేరుకున్నారు. ఇదే విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “జపాన్ మాజీ ప్రధాని అబే గౌరవార్థం భారతదేశం 9 జూలై 2022న జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. ఈ పర్యటనలో అబే స్మృతికి ప్రధాని మోడీ నివాళులు అర్పించనున్నారు.

టోక్యోకు బయలుదేరే ముందు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా తాను మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఈ రాత్రికి టోక్యో వెళ్తున్నాను’ అని పేర్కొన్నారు. అబే తనకు ప్రియమైన స్నేహితుడని..  ఇండో-జపనీస్ స్నేహానికి గొప్ప మద్దతుదారునిగా అభివర్ణించారు ప్రధాని మోడీ.  భారతీయులందరి తరపున సంతాపాన్ని తెలియజేసేందుకు తాను ప్రధానమంత్రి కిషిదా, శ్రీమతి అబేను కలుస్తానని ప్రధాని తెలిపారు. అబే దార్శనికతకు అనుగుణంగా భారత్-జపాన్ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తూనే ఉంటాం’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

షింజో అబేను ‘ప్రత్యేక స్నేహితుడు’గా అభివర్ణించిన ప్రధాని మోడీ  అదే సమయంలో, ప్రధాని మోడీ జపాన్ పర్యటన గురించి విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సమాచారం ఇచ్చారు. జపాన్ దేశంలో ప్రధాని పర్యటన సుమారు 12 నుండి 16 గంటల సాగనున్నదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో మధ్యాహ్నం 3 గంటలకు ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. అనంతరం షింజో అబే భార్య ఓకీ అబేతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

అబే మృతికి సంతాపం తెలుపైన మోడీ అబే తనకు “ప్రియమైన స్నేహితుడు”గా అభివర్ణించారు. జపాన్ మాజీ ప్రధాని ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జపాన్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబే జూలై 8న ఆ దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఓ దుండగుడు హత్య చేశాడు. పోలీసులు ఉన్నప్పటికి అబేపై దాడికి పాల్పడ్డాడు.

టోక్యోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: మంగళవారం టోక్యోలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. అబే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్ సహా పలువురు విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అదనపు నిఘా ఏర్పాటు చేశారని జపాన్ వార్తా సంస్థ ‘క్యోడో’ తెలిపింది. పోలీస్ మేజర్ రోడ్లు, J.R. టోక్యో స్టేషన్‌తో పాటు, జనం గుమికూడే ప్రదేశాలపై కూడా నిఘా ఉంచింది. టోక్యోలోని నిప్పన్ బుడోకాన్ హాల్ సమీపంలోని పార్కులో అబే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్