ట్రంప్‌తో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్.. ఏం మాట్లాడారంటే?

పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు కీలకమైన అంశాలపై వారు చర్చించారు. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ట్రంప్‌తో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్.. ఏం మాట్లాడారంటే?
Pm Modi Speaks To Donald Trump

Updated on: Apr 14, 2026 | 10:25 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇద్దరు నేతలు సుమారు 40 నిమిలిషాల పాటు అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులపై సమీక్షించారు. వివిధ రంగాలలో భారత్-అమెరికా మధ్య జరుగుతున్న పురోగతిపై ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. అన్ని రంగాల్లో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అలాగే పశ్చిమాసియా యుద్దం కారణంగా మూతబడిన స్టేర్ట్ ఆఫ్ హర్మూజ్‌ జలసందిని మళ్లి తిరిగి ఓపెన్ చేయడంపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకోవడంపై ప్రధాన్యత సంతరించుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఈ ఏడాదిలో జరిగిన మూడవ ఫోన్ కాల్ ఇది. అంతకుముందు ఫిబ్రవరి 2న వాణిజ్య ఒప్పందం గురించి, మార్చి 24న పశ్చిమాసియా పరిస్థితుల గురించి వారు మాట్లాడుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us