అగ్రరాజ్యం అమెరికాను ఇయన్ హరికేన్ అతలాకుతలం చేసింది. ఆ దేశ చరిత్రలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన తుపాన్ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలన్నీ మారిపోయాయి. తీంతోపాటు దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తుఫాన్ ప్రతాపం చూపింది. తుపాన్ ధాటికి ఇప్పటివరకు 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, విద్యుత్ సౌకర్యం లేక లేక ప్రజలు అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాలు నీటమునగగా.. వేలాది సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద నీరు పోటెత్తుతుండడంతో ప్రజలు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. శక్తివంతమైన ఇయాన్ తుఫాన్ ప్రస్తుతం కేటగిరీ 4 లో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ హరికేన్ ధాటికి 54 మంది మరణించగా.. ఫ్లోరిడాలోనే 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వేలాది మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దాదాపు 100 మంది వరకు మరణించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
అట్లాంటికా సముద్రంలో ఏర్పడిన ఇయన్ హరికేన్ దక్షిణ కరోలినా నుంచి ఉత్తర కరోలినా వైపు వెళ్లే క్రమంలో బలహీనపడి ఉష్ణమండల అనంతర తుపాను (పోస్ట్-ట్రోపికల్ సైక్లోన్) గా మారినట్లు అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్‌ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానులలో ఒకటైన హరికేన్ ఇయాన్ విధ్వంసంతో చాలామంది గల్లంతైనట్లు అధికారు తెలిపారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధ్యక్షుడు జో బైడెన్ వారం తరువాత పర్యటిస్తారని అధికారులు తెలిపారు.
ప్రధాని మోడీ సంతాపం..
కాగా.. ఇయాన్ హరికేన్ కారణంగా సంభవించిన ప్రాణనష్టం, విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మెడీ స్పందించారు. దీనిపై ట్విట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ట్యాగ్ చేస్తూ సంతాపాన్ని తెలియజేశారు.
My sincere condolences and heartfelt sympathies to @POTUS @JoeBiden for the loss of precious lives and devastation caused by Hurricane Ian. Our thoughts are with the people of the United States in these difficult times.
— Narendra Modi (@narendramodi) October 2, 2022
మరిన్ని ప్రపంచ వార్తల కోసం..