ఆపిల్ సంస్థకు భారీ జరిమానా వేసిన ఇటలీ… కోటి 20 లక్షల డాలర్లు చెల్లించాలని ప్రకటన… షాక్ లో టెక్ దిగ్గజం…

|

Nov 30, 2020 | 8:38 PM

ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ కంపెనీపై భారీ జరిమానాను విధించింది. వినియోగదారులను నమ్మించేందుకు ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది.

ఆపిల్ సంస్థకు భారీ జరిమానా వేసిన ఇటలీ... కోటి 20 లక్షల డాలర్లు చెల్లించాలని ప్రకటన... షాక్ లో టెక్ దిగ్గజం...
Follow us on

ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ఆపిల్ కంపెనీపై భారీ జరిమానాను విధించింది. వినియోగదారులను నమ్మించేందుకు ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ 10 మిలియన్ యూరోస్ ( 12 మిలియన్ డాలర్లు, కోటి 20 లక్షల డాలర్లు) జరిమానా విధించింది.

వాటర్ రిసిస్టెంట్లుగా తప్పుడు ప్రచారంతోనే….

ఇటలీ యాంటీట్రస్ట్‌ అథారిటీ ప్రకటన ప్రకారం… ఆపిల్‌ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదని, వాటర్‌ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది. కానీ కంపెనీ డిస్‌క్లైమర్‌లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్‌ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వినియోగదారులను తప్పుడు ప్రకటనతో మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులను ఆపిల్ తప్పుదోవపట్టించిందని జరిమానా విధించింది.