Mars rover: మార్స్ రోవర్ ప్రయోగం విజయవంతం.. అంగారకుడిపై తీసిన ఫొటోను షేర్ చేసిన నాసా..

Perseverance rover: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా.. అంగారక గ్రహం మీద మార్స్ రోవర్ ల్యాండ్ అయిన తర్వాత తీసి..

Mars rover: మార్స్ రోవర్ ప్రయోగం విజయవంతం.. అంగారకుడిపై తీసిన ఫొటోను షేర్ చేసిన నాసా..

Edited By: Ram Naramaneni

Updated on: Feb 19, 2021 | 10:55 AM

Perseverance rover: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా.. అంగారక గ్రహం మీద మార్స్ రోవర్ ల్యాండ్ అయిన తర్వాత తీసి పంపిన చిత్రాన్ని గురువారం విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయంవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు నాసా ఏడు నెలల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే అప్పుడు ప్రయోగించిన ఈ మార్స్ రోవర్ ఈ రోజు కక్ష్యలో ప్రయాణించి లక్ష్యానికి చేరువైందని.. చివరి ఏడు నిమిషాల గండాన్ని సైతం అధిగమించందని నాసా వెల్లడించింది.

అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు, అక్కడి వాతావరణాన్ని కనుగొనేందుకు కోసం నాసా రోబో మార్స్‌ రోవర్‌ను ప్రయోగించింది. ఈ రోవర్ అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో విజయవంతంగా ల్యాండ్ అయి అంతరిక్ష నౌక నుంచి విడిపోయింది. ఈ ప్రయోగానికి నాసా 2.4 బిలియన్ డాలర్లు (దాదాపు 17వేల కోట్లు) ఖర్చు చేసింది. దీనితోపాటు ఒక SUV సైజులో ఉండే Perseverance అనే రోబోను కూడా అంగారక గ్రహం మీదకు పంపింది. ప్రస్తుతం అది తీసిన ఫొటోలను, దృశ్యాలను నాసా విడుదల చేసింది.

పెర్సర్వరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన అనంతరం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ స్టీవ్ జుర్జిక్ బృందాన్ని అభినందించారు. జూలై 30, 2020 న ప్రారంభమైన మార్స్ రోవర్ ప్రయాణం.. ఈ రోజు విజయవంతమైందని వెల్లడించారు. కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకోని సైతం శాస్త్రవేత్తలు అసాధారణ కృష్టిచేశారని వెల్లడించారు.

Also Read:

Moto E7 Power Mobile: నేడే మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం

కరెంట్ బిల్ నెలకు రూ.70 మాత్రమే.. ఉద్యోగాన్ని వదిలి సోలార్ పవర్‌తో.. వ్యాపారంలో దూసుకెళ్తున్న అభిషేక్ మానే..