Havana Syndrome: అమెరికాను వణికిస్తున్న మరో కొత్త విపత్తు.. సైనికులను అలెర్ట్ చేసిన పెంటగాన్

|

Sep 18, 2021 | 12:25 PM

అమెరికాను మరో కొత్త విపత్తు హవానా సిండ్రోమ్ వణికిస్తోంది. అమెరికా దౌత్యవేత్తలు మాత్రమే ఈ సిండ్రోమ్ బారినపడుతున్నారు. ఈ సిండ్రోమ్ బారినపడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది.

Havana Syndrome: అమెరికాను వణికిస్తున్న మరో కొత్త విపత్తు.. సైనికులను అలెర్ట్ చేసిన పెంటగాన్
Havana Syndrome
Follow us on

అమెరికాను మరో కొత్త విపత్తు హవానా సిండ్రోమ్ వణికిస్తోంది. అమెరికా దౌత్యవేత్తలు మాత్రమే ఈ సిండ్రోమ్ బారినపడుతున్నారు. ఈ సిండ్రోమ్ బారినపడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది. కొందరు వినికిడి కోల్పోతున్నారు. 2016లో క్యూబా రాజధాని హవానాలో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారిలో దీన్ని గుర్తించారు. హవానాలో తొలుత గుర్తించినందున దీనికి హవానా సిండ్రోమ్ అని నామకరణం చేశారు.  ఈ సిండ్రోమ్ బారిన పడుతున్న బాధితుల్లో ఎక్కువ మంది క్యూబా, చైనా, రష్యా, ఆస్ట్రియా, పోలాండ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారే ఉన్నారు. హవానా సిండ్రోమ్ ద్వారా.. శత్రువులు తమను టార్గెట్ చేస్తున్నట్లు  అమెరికా అనుమానిస్తోంది. దౌత్యవేత్తలతో పాటు తమ సైనికులు కూడా భారీ సంఖ్యలో ఈ సిండ్రోమ్ బారినపడే ప్రమాదముందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. దీంతో రెండ్రోజుల క్రితం హవానా సిండ్రోమ్‌‌పై  తమ సైనికులను పెంటగాన్ అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా మెదడు సమస్యలతో సతమతమవుతున్న సైనికులు వెంటనే తమకు సమాచారమివ్వాలని కోరింది.

ఇప్పటి వరకు అమెరికా దౌత్యవేత్తలు మాత్రమే ఈ సిండ్రోమ్ బారినపడ్డారు. అయితే వీరికి మాత్రమే ఈ సిండ్రోమ్ ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు.  హవానా సిండ్రోమ్ బారినపడుతున్న వారికి మెదడు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కాలింగ్‌లో తేలింది. భారీ ప్రమాదం జరిగితే మెదడు దెబ్బతినే స్థాయిలో.. హవానా సిండ్రోమ్ కారణంగా మెదడు దెబ్బతినడం పట్ల వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 200 మంది అమెరికన్లు ఈ సిండ్రోమ్ బారినపడినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా హవానా సిండ్రోమ్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దృష్టిసారించారు.

శత్రువుల పనేనా? అమెరికాకు అనుమానం..

దీని వెనుక శత్రు దేశాల కుట్ర ఏమైనా ఉండొచ్చన్న అమెరికాకు అనుమానం కలుగుతున్నాయి. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తు తెలియని ప్రత్యర్థులు తమ సిబ్బందిపై దాడులు చేస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. అమెరికా అలా సందేహించడానికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ సిండ్రోమ్ బారినపడుతున్న వారిలో ఎక్కువమంది అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనికులు, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ ఉద్యోగులే ఉన్నారు.

Also Read..

Pooja Hegde : స్టార్ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టేసిన బుట్టబొమ్మ.. అమ్మడి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు