ఇంగ్లాండ్‌లోని ఓ పాఠశాలలో చదివే 12 ఏళ్ల ముస్లిం అమ్మాయిపై ఆ పాఠశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే పాఠశాల డ్రెస్ కోడ్ సరిగ్గా పాటించడం లేదని తనకిష్టమైన దుస్తులు వేసుకొని స్కూల్‌కి వస్తోందని మండిపడుతోంది. అంతేకాదు ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులకు లీగల్‌గా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే పాఠశాల డ్రెస్ కోడ్ ప్రకారం.. విద్యార్థులందరూ మోకాళ్లపైకి ఉండేలా స్కర్ట్ వేసుకొని రావాలి కానీ ఈ అమ్మాయి కొంచెం పెద్దదిగా ఉండే విధంగా లెహెంగా ధరించి వస్తుంది.
దీనికి పాఠశాల యాజమాన్యం తిరస్కరిస్తూ ప్రతిరోజు డ్రెస్ మార్చుకొని రావాలని ఇంటికి పంపిస్తోంది. కానీ దీనికి ఆ అమ్మాయి ఇలాంటి స్కర్టులు వేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. తల్లిదండ్రులు ఆమెను స్కర్ట్ వేసుకొని స్కూల్‌కి పంపించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయంపై ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యం స్కర్ట్ వేసుకోమని బెదిరించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ కుటుంబం ఇస్లాంను ఆరాధిస్తుందని తమ సంప్రదాయం ప్రకారం పొట్టి స్కర్టులు వేసుకోవడం నిషిద్దమని తెలిపారు. పొడవాటి దుస్తులను మాత్రమే ధరించాలని చెప్పుకొచ్చారు. అలాగే తమ కూతురు మెరుగైన విద్యార్థి అని, చదువులో ఎప్పుడు ముందుంటుందని, పాఠశాల నియమ నిబంధనలను పాటిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి అమ్మాయి పొడవాటి లెహెంగా ధరించడం వల్ల పాఠశాలకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు.
వీడు మాయగాడు, మహా మోసగాడు.. ఫేస్‌బుక్‌లో ప్రేమ పేరుతో అందమైన అమ్మాయిలకు ఎర.. అనంతరం..