Trending News: ఆ పాప మిస్సై రెండేళ్లు అవుతుంది. ఎన్ని చోట్లు వెతికినా ఆచూకి లేదు. పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ కేసును సాల్వ్ చేశారు. ఇటీవల ఒక ఇంట్లో మెట్ల కింద ఉన్న ఒక రహస్య అరలో ఆ చిన్నారిని కనుగొన్నారు. ఈ ఘటన న్యూయార్క్( New York )లో చోటుచేసుకుంది. ఆ పాప పేరు పైస్లీ షుల్టిస్. సాగెర్టీస్ నగరంలోని ఒక ఇంట్లో మెట్ల కింద రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక అరలో చిన్నారి దొరికినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ పాపకు ఆరేళ్లు. చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఆమెను లీగల్ గార్డియన్‌కు అప్పగించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పైస్లీ కస్టడీని కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులే పాపను దాచిపెట్టారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… నాలుగేళ్ల వయసున్నప్పుడు 2019 జులైలో న్యూయార్క్‌లోని టియోగా కంట్రీ నుంచి పైస్లీ కనిపించకుండా పోయిందని పోలీసులకు కంప్లైంట్ అందింది. అయితే పాపను ఆమె పేరెంట్స్ కిడ్నాప్ చేసుంటారని పోలీసులు భావించారు. సాగర్టీస్ నగరంలోని ఒక ఓ సీక్రెట్ ప్లేసులో ఉన్న భవనంలో పాప దాచి ఉంటారని సమాచారం రావడంతో పోలీసులు ఆ ఇంటికి సెర్చ్ చేయడానికి వెళ్లారు. వాస్తవానికి అక్కడ పోలీసులు గతంలో చాలాసార్లు సోదాలు చేశారు. కానీ ఎలాంటి ఆచూకి లభించలేదు.
ఆ ఇల్లు పాప తాతయ్య కిర్క్ షుల్టిస్ సీనియర్‌ది. పోలీసులు తనిఖీలు చేసినప్పుడు పైస్లీ ఎక్కడుందో తనకు తెలీదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, ఇటీవల మరోసారి ఆ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసినప్పుడు, పోలీసు అధికారుల్లో ఒకరైన ఎరిక్ తీలేకు బేస్‌మెంట్‌కు వెళ్లే చెక్క మెట్లపై అనుమానం కలిగింది. దీంతో ఆ ఆఫీసర్ టర్చ్ లైట్ వేసి చూడగా.. లోపల ఒక దుప్పటి కనిపించింది. దీంతో పోలీసులు ఆ చెక్క మెట్లను తొలగిస్తుండగా.. లోపల దృశ్యం చూసి కంగుతిన్నారు. ఎందుకంటే.. అక్కడ రెండేళ్ల క్రితం మిస్సైన పైస్లీతో పాటు ఆమె తల్లి కూడా కనిపించారు. దీంతో వెంటనే చిన్నారికి వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్యంగానే ఉందని రిపోర్ట్ రావడంతో.. పాపను తన అక్కకు అప్పగించారు. పైస్లీ పేరెంట్స్ కూపర్, కిర్క్ షుల్టిస్ జూనియర్… తమ ఇద్దరు కూతుళ్ల కస్టడీని కోల్పోయారు. దీంతో వారు ఈ పనికి పూనుకున్నారు. కాగా పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి హాని ఉందని భావిస్తే.. లేదా వారి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోయినా.. లేదా తల్లిదండ్రులు ఏదైనా క్రైమ్‌కు పాల్పడినా, పేరెంట్స్ చనిపోయినా అమెరికా లాంటి దేశాల్లో సదరు పిల్లల బాధ్యతను లీగల్ గార్డియన్‌కు అప్పగిస్తారు.
Also Read: Krishna District: పేరుకే బ్యూటీషియన్.. ఆమె ఇంట్లోని ఫ్రిజ్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్
కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు