Paralysis: ఎవరి సాయం లేకుండానే అవలీలగా నడుస్తున్న పక్షవాత బాధితుడు.. పరిశోధకుల ఆవిష్కరణ సక్సెస్

ఎవరైన పక్షవాతానికి గురైతే వారి పరిస్థితి ఇక ఇంటికే పరిమితమవుతుంది. ఇతరుల సహాయం లేకుండా వారు రోజులు గడపలేరు. చక్రాల కుర్చీకి లేదా మంచానికే పరిమితమైపోతుంటారు. అయితే నెదర్లాండ్‌లోని పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి ప్రత్యేక బ్లూటూత్ పరికరం సాయంతో ఎవరి అవసరం లేకుండా నడవగలుగుతున్నాడు.

Paralysis: ఎవరి సాయం లేకుండానే అవలీలగా నడుస్తున్న పక్షవాత బాధితుడు.. పరిశోధకుల ఆవిష్కరణ సక్సెస్
Paralyzed Man

Updated on: Jun 01, 2023 | 3:40 PM

ఎవరైన పక్షవాతానికి గురైతే వారి పరిస్థితి ఇక ఇంటికే పరిమితమవుతుంది. ఇతరుల సహాయం లేకుండా వారు రోజులు గడపలేరు. చక్రాల కుర్చీకి లేదా మంచానికే పరిమితమైపోతుంటారు. అయితే నెదర్లాండ్‌లోని పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి ప్రత్యేక బ్లూటూత్ పరికరం సాయంతో ఎవరి అవసరం లేకుండా నడవగలుగుతున్నాడు. ఆ బ్లూటూత్‌ను అతని మెదడు, వెన్నుముకకు అనుసంధానించి సంకేతాలు పంపిస్తుండటం వల్లే చక్రాల కుర్చీకి పరిమితమైన ఆ వ్యక్తి నడవగలుగుతున్నాడు. ఈ సరికొత్త పరికరాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించారు.

ఇక వివరాల్లోకి వెళ్తే 40 ఏళ్ల గెర్డ్ జాన్ ఓస్కం 12 సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెన్నుముక దెబ్బతినడంతో చివరికి పక్షవాతానికి గురయ్యాడు. అప్పటినుంచి చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు. ఇటీవల వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. మెదడు, వెన్నెముకల్లో ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. వీటిని బ్లూటూత్‌తో అనుసంధానించారు. అయితే ఈ బ్లూటుత్ మెదడు నుంచి వచ్చే సంకేతాల వల్ల కాళ్లతో పాటు అతని ఇతర శరీర భాగాల కదలికలను నియంత్రిస్తోంది. దీంతో జాన్ ఓస్కం ఇతరుల సహాయం లేకుండానే సొంతంగా నిలబడగలుగుతున్నాడు. నడవగలుగుతున్నాడు, అలాగే మెట్లు కూడా ఎక్కుతున్నాడు. ప్రస్తుతం తయారుచేసిన ఈ బ్లూటుత్ పరికరం పరిమాణం కాస్త పెద్దదిగా ఉందని.. భవిష్యత్తులో దీన్ని చిన్నగా తయారుచేసేందుకు ప్లాన్ వేస్తున్నామని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..