Iran Road Accident: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 28 మంది పాకిస్థానీయుల దుర్మరణం..!

|

Aug 21, 2024 | 12:07 PM

పాకిస్థాన్ నుంచి ఇరాక్ వెళ్తున్న యాత్రికులతో వెళ్తున్న బస్సు ఇరాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 28 మంది చనిపోయారు. మరో 23 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Iran Road Accident: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 28 మంది పాకిస్థానీయుల దుర్మరణం..!
Iran Road Accident
Follow us on

పాకిస్థాన్ నుంచి ఇరాక్ వెళ్తున్న యాత్రికులతో వెళ్తున్న బస్సు ఇరాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 28 మంది చనిపోయారు. మరో 23 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు యాత్రికులంతా బస్సులో ఇరాక్‌కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

మంగళవారం(ఆగస్ట్ 20) అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు స్థానిక అత్యవసర సేవల అధికారి మహ్మద్ అలీ మలెక్జాదే తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని IRNA వార్తా సంస్థ ఈ ప్రమాదం గురించి పేర్కొంది. ఇరాన్‌లోని యాజ్ద్ ప్రావిన్స్‌లోని డెహ్‌షీర్-టాఫ్ట్ పోస్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయపడ్డారని, వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నారు. 7వ శతాబ్దంలో షియా సెయింట్ మరణించి 40వ రోజు అయిన సందర్భంగా అర్బయిన్ జ్ఞాపకార్థం బస్సులో ఉన్న యాత్రికులు ఇరాక్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..