Pakistan: పాకిస్తాన్‌లో పుట్టుకొచ్చిన కొత్త ఉగ్ర సంస్థ.. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు .. ఐదుగురు మృతి

|

Dec 15, 2023 | 6:17 PM

పోలీస్ లైన్లపై దాడికి కొత్త ఉగ్రవాద సంస్థ 'అన్సారుల్ జిహాద్' బాధ్యత వహించిందని పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం మిగిలిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు. దాడిలో గాయపడిన పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పీటీఐ ప్రకారం ట్యాంక్ జిల్లా పోలీసు అధికారి ఇఫ్తికార్ షా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసినట్లు.. బాంబుతో తనను తాను పేల్చుకోవడంతో ఈ దాడి జరిగిందని చెప్పారు.

Pakistan: పాకిస్తాన్‌లో పుట్టుకొచ్చిన కొత్త ఉగ్ర సంస్థ.. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు .. ఐదుగురు మృతి
Pakistan Terrorist Attack
Follow us on

పాకిస్థాన్‌లో మళ్ళీ ఉగ్రవాదులు పంజా విసిరారు. పాక్ వాయువ్య ప్రాంతంలోని ప్రాంతీయ పోలీసు ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి చేశారు. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరణించగా, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు 23 మంది సైనికులు మరణించారు. ఈ దాడి జరిగిన పోలీసు లైన్ ఖైబర్ పఖ్తుంక్వాలోని ట్యాంక్ జిల్లాలో ఉంది. దీంతో పాటు చెక్ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు సమాచారం.

పీటీఐ ప్రకారం ట్యాంక్ జిల్లా పోలీసు అధికారి ఇఫ్తికార్ షా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసినట్లు.. బాంబుతో తనను తాను పేల్చుకోవడంతో ఈ దాడి జరిగిందని చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు స్పందించి ఆ మొత్తం ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి హెచ్చరించామని, పోలీసు లైన్‌లో ఉన్న సైనికులందరినీ సురక్షితంగా తరలించామని పేర్కొన్నారు. లేదంటే ఈ దాడి మరింత పెద్దదిగా జరిగి ఉండేదని అధికారి తెలిపారు.

పోలీస్ లైన్లపై దాడికి కొత్త ఉగ్రవాద సంస్థ ‘అన్సారుల్ జిహాద్’ బాధ్యత వహించిందని పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం మిగిలిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు. దాడిలో గాయపడిన పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మూడు రోజుల క్రితం కూడా ఉగ్రదాడి

మూడు రోజుల క్రితం మంగళవారం వాయువ్య పాకిస్థాన్‌లో తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 23 మంది సైనికులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) ప్రకటించింది. తెహ్రీక్-ఎ-జిహాద్ అనేది పాకిస్తాన్‌లోని నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌తో ముడిపడి ఉన్న కొత్త ఉగ్రవాద సంస్థ.

నవంబర్ 4న ఎయిర్ బేస్ పై దాడి

నవంబర్ 4న లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మియాన్‌వలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్‌పై కూడా టీజేపీ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో స్థావరంలో ఉన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో అనేక ఉగ్రదాడులు జరుగుతున్నాయి. పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చాలా వరకు దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..