పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారా ? వెల్లువెత్తుతున్న ఊహాగానాలు

| Edited By: Anil kumar poka

Mar 04, 2021 | 7:15 PM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రం స్థానికకాలమానం ప్రకారం ఏడున్నర గంటల ప్రాంతంలో  తమ దేశ ప్రజలనుద్దేశించి......

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారా ? వెల్లువెత్తుతున్న ఊహాగానాలు
Follow us on

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రం స్థానికకాలమానం ప్రకారం ఏడున్నర గంటల ప్రాంతంలో  తమ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నేషనల్ అసెంబ్లీ (పార్లమెంట్) నుంచి తాను విశ్వాస పరీక్క్షను కోరుతానని అయన మొదట ప్రకటించారు. పైగా సెనేట్ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్  పార్టీ  ఓడిపోవడంతో ఆయన గౌరవప్రదంగా రాజీనామా చేయాలనీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఆర్మీ చీఫ్, జనరల్ కామర్ జావెద్ బాజ్వా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్ లతో సమావేశమయ్యారు. సెనేట్ ఎన్నికల్లో పాలక పార్టీకి చెందిన అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ షేక్.. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ అభ్యర్థి, మాజీ ప్రధాని సయీద్ యూసుఫ్ రజా గిలానీ చేతిలో ఓడిపోయారు. ఈ పార్టీ 11 విపక్షాలతో కూడిన పార్టీ.

సెనేట్ ఫలితాలు వెలువడిన వెంటనే పీపీపీ చైర్మన్ బిలాల్ భుట్టో జర్దారీ..ఇమ్రాన్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. అటు గిలానీని పలువురు ప్రతిపక్ష నేతలు అభినందించారు. గిలానీ గెలుపు గ్లోరియస్ విక్టరీ అని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. అటు పాక్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అసలు సెనేట్ ఎన్నికల్లో తమ పార్టీ  ఓడిపోతుందని ఇమ్రాన్ ఖాన్ ఊహించి ఉండరని అంటున్నారు.  ఈ రాజకీయ సంక్షోభానికి సంబంధించి నమరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Elon Musk : భారత్‌లో అడుగుపెట్టనున్న ప్రపంచ కుబేరుడు.. టెలికాం రంగంలో ఎంట్రీ.. ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

డ్రగ్స్ కేసులో బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి పోలీస్ కస్టడీ 18 వరకు పొడిగింపు