Pakistan Crisis: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారా.. మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగం!

|

Mar 30, 2022 | 5:51 PM

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ISI డైరెక్టర్ జనరల్ (DG) లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ ఇమ్రాన్ ఖాన్ వద్దకు చేరుకున్నారు.

Pakistan Crisis: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారా.. మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగం!
Imran Khan
Follow us on

Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్(Army Chief General) కమర్ జావేద్ బజ్వా, ISI డైరెక్టర్ జనరల్ (ISI DG) లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ ఇమ్రాన్ ఖాన్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే, రాజీనామా ప్రశ్న తలెత్తదని, ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు పోరాడతారని పాకిస్థాన్ అంతర్గత మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం మాత్రమే ప్రధానమంత్రి లేఖ గురించి మాట్లాడుతామన్నారు.

తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి విదేశాల నుంచి కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పేర్కొన్నారు. తన వాదనలను ధృవీకరించే లేఖ తన వద్ద సాక్ష్యంగా ఉందని అతను స్పష్టం చెప్పాడు. ఫవాద్ చౌదరి కూడా ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు ఆడగల ఆటగాడు, రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. క్షేత్రం జరుగుతుంది, స్నేహితులు ఎవరో తేలుతుంది. శత్రువులు ఎవరో కూడా చూస్తామన్నారు.

ఇదిలావుంటే, పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ ఎన్ నాయకుడు షాబాజ్ షరీఫ్ ఈరోజు మరోసారి ఇమ్రాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని షరీఫ్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు న్యాయశాఖ మంత్రి ఫరూక్ నసీమ్, ఐటీ శాఖ మంత్రి అమీనుల్ హక్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు నేతలు ఇమ్రాన్ ప్రభుత్వానికి మిత్రపక్షమైన MQM పార్టీకి చెందినవారు. ఇద్దరు మంత్రుల రాజీనామా తర్వాత ఇమ్రాన్ ఖాన్ కష్టాలు మరింతగా పెరిగాయి. కాగా, మార్చి 25న విపక్షాలు ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 342 మంది సభ్యులున్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఖాన్ పార్టీకి 155 మంది సభ్యులు ఉన్నారు. అధికారంలో కొనసాగడానికి కనీసం 172 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం.

Read Also…

Pakistan Crisis: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం.. ముంబై దాడికి పాల్పడ్డ కసబ్‌పై పాక్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు