యుద్ధం వస్తే, 4 రోజుల్లోనే ఖేల్ ఖతం.. పాకిస్థాన్ ఆయుధాల కథ తెలిస్తే నవ్వాపుకోలేరు..!

పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆయుధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బెదిరింపులు ఇస్తున్న పాకిస్తాన్ దగ్గర 4 రోజులకు సరిపడే మందుగుండు సామగ్రి మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఆర్థిక సంక్షోభం కారణంగా, సైన్యం చమురు, రేషన్లను తగ్గించాల్సి వచ్చింది. భారతదేశాన్ని సవాలు చేస్తున్న పాకిస్తాన్ సైనిక సంసిద్ధతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే భారతదేశ సైనిక శక్తి ముందు పాకిస్థాన్ సత్తా జుజుబీ అంటున్నారు నిపుణులు.

యుద్ధం వస్తే, 4 రోజుల్లోనే ఖేల్ ఖతం.. పాకిస్థాన్ ఆయుధాల కథ తెలిస్తే నవ్వాపుకోలేరు..!
Pakistan Mailitary weakness

Updated on: May 04, 2025 | 11:10 AM

యుద్ధం అంటే ఓ ఎగేసుకుని పడిపోవడం కాదు. సైనిక శక్తి ఉందని విర్రవీగడం కాదు. అణుబాంబులున్నాయని బీంకాలు పోవడం కాదు. ఆ పాకిస్తాన్‌లా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కాదు. యుద్ధమంటే.. శత్రువు గుండెల్లో నిద్రపోవడం. వార్ సైరన్ మోగించకుండానే.. ప్రత్యర్ధి దేశంలో భయం తాలూకా సంకేతాలు పంపించడం.. ఇప్పుడు భారత్ ఇదే స్ట్రాటజీతో పాకిస్తాన్‌ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టన్నుల కొద్దీ భయాన్ని పాకిస్తాన్‌కు పరిచయం చేస్తోంది. మోదీ సర్కార్ స్ట్రాటజీస్‌కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది.

పెహల్గామ్ దాడుల తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్ గజగజ వణికిపోతుంది. భారత సైనక చర్యకు దిగలేదు.. కానీ పాకిస్తాన్‌ను పరుగులు పెట్టిస్తోంది. వార్ బెల్ కొట్టలేదు.. కానీ స్కూల్ బెల్ కొట్టగానే పిల్లకాయలు తమ ఇళ్లకు పరుగులు పెట్టినట్లుగా.. పాకిస్తాన్ సైన్యంలో చాలామంది విదేశాలకు పారిపోతున్నారు. భారత్ స్ట్రాటజీస్ అర్థంగాక పాక్ తల పట్టుకుంటోంది. యుద్ధంపై భారత్ ఎలాంటి టైమ్‌లైన్ ఇవ్వలేదు..కానీ పాకిస్తానే 24గంటలు.. 36గంటలు.. 48 గంటలు..అంటూ గంటలు లెక్కపెడుతూ.. భారత్ దాడిని ఊహించుకుంటూ.. నిద్రలేని రాత్రులు గడుపుతోంది.. ఇది కదా భారత్…అది కదా భయమంటే పాకిస్తాన్.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. భారతదేశాన్ని సవాలు చేస్తున్న పాకిస్తాన్ స్వయంగా వీధుల్లోకి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది. యుద్ధం గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్ దగ్గర ఇంకా 96 గంటల మందుగుండు సామగ్రి మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశంతో యుద్ధం జరిగితే, పాకిస్తాన్ 4 రోజులు మాత్రమే భారతదేశాన్ని ఎదుర్కోగలదంటున్నారు నిపుణులు.

ఒకవైపు పాకిస్తాన్ నాయకులు భారతదేశాన్ని యుద్ధానికి బెదిరిస్తున్నారు. మరోవైపు, పాకిస్తాన్ సైనిక సన్నాహాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ తన ఫిరంగిదళంలో మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది. ఒక నివేదిక ప్రకారం, పాకిస్తాన్ సైన్యం కేవలం 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని తరువాత, పాక్ సైన్యం మందుగుండు సామగ్రి లేకపోవడం వల్ల మునుపటిలా లొంగిపోవడం ఖాయం. అయితే భారతదేశ సైనిక శక్తి ముందు పాకిస్తాన్ ఎక్కడా కనిపించదు.

స్థానిక కథనాల ప్రకారం.. పాకిస్తాన్ కు 4 రోజులు యుద్ధం చేయగల సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ సైన్యం మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ సైన్యం దగ్గర ట్యాంకులు నింపుకోవడానికి కూడా ఇంధనం లేని పరిస్థితి ఏర్పడింది. M109 హోవిట్జర్లు, BM-21 బహుళ రాకెట్ లాంచర్లకు మందుగుండు సామగ్రి అందుబాటులో లేదు. కొత్త SH-15 తుపాకులకు మందుగుండు సామగ్రి లేదు. తొపాకులు, రాకెట్ లాంచర్లు కేవలం ప్రదర్శన వస్తువులుగా మారాయి.

మరోవైపు, పాకిస్తాన్ పేదరికం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. పాకిస్తాన్ అప్పుడప్పుడు సహాయం కోసం అర్థిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో కూడా, పాకిస్థాన్ పరిస్థితి విషమంగా ఉంది. భారతదేశంతో గొడవ పడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారి విదేశీ మారక నిల్వలు అయిపోయే అంచున ఉన్నాయి. సైన్యం చమురు, రేషన్లను కూడా తగ్గించాల్సి వచ్చింది. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి కారణంగా, పాకిస్తాన్ సైన్యం అనేక యుద్ధ విన్యాసాలను నిలిపివేసింది. పెట్రోల్, డీజిల్ లేకపోవడం వల్ల సైనిక వాహనాలు పనిలేకుండా పడి ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనా నుండి 40 VT-4 ప్రధాన యుద్ధ ట్యాంకులను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 350 VT-4 ట్యాంకులు ఉన్నాయి. కానీ అవి భారతదేశ సైనిక శక్తి ముందు బలహీనంగా ఉన్నాయి. భారత సైన్యం వద్ద 1000 కంటే ఎక్కువ T90 ట్యాంకులు, T-72 మరియు స్వదేశీ అర్జున్ ట్యాంకులు ఉన్నాయని, ఇవి ఏ భూ యుద్ధంలోనైనా పాకిస్తాన్‌ను ఓడించగలవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..