ఆఫ్గనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..

ఆఫ్గనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తుండగా .. పాకిస్తాన్ ఐఎస్ఐ వారికి కొత్త ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘన్ లో ఇండియా నిర్మించిన కట్టడాలను, భవనాలను టార్గెట్ చేయాలని ఇదే మీ లక్ష్యం కావాలని కోరింది.

ఆఫ్గనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..
Pakistan Isi Instructions To Talibans
Umakanth Rao

| Edited By: Phani CH

Jul 18, 2021 | 5:14 PM

ఆఫ్గనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తుండగా .. పాకిస్తాన్ ఐఎస్ఐ వారికి కొత్త ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘన్ లో ఇండియా నిర్మించిన కట్టడాలను, భవనాలను టార్గెట్ చేయాలని ఇదే మీ లక్ష్యం కావాలని కోరింది. ఈ రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ఆ దేశానికి చాలా సాయపడింది. సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ఆ దేశంలోని డెలారమ్-జరాంజ్ సల్మా డ్యాం మధ్య 218 కి.మీ. పొడవునా రోడ్డు నిర్మాణానికి సహాయపడింది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవన నిర్మాణానికి చేయూతనిచ్చింది . 2015 లో ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇక ఆఫ్ఘన్ లో విద్యా రంగానికి సైతం నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఇండియాలో ఆఫ్ఘన్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లభిస్తున్నాయి. ఇదంతా చూసి పాకిస్థాన్ లోలోన మండిపడుతోంది. సమయం కోసం వేచి చూస్తూ..ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు సపోర్ట్ ప్రకటించడం ద్వారా ఇండియాపై తమ కసి తీర్చుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే 10 వేలమందికిపైగా పాకిస్థాన్ సైనికులు ఆఫ్ఘన్ లోని వార్ జోన్ లోకి ప్రవేశించారట.. ఆఫ్ఘన్ లో భారతీయ చిహ్నాలు ఏవి ఉన్నా వాటిని నిర్మూలించాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ సూచించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాబూల్ లోని భారతీయ వర్కర్ల ను ఖాళీ చేయించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. కాబూల్ నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన షాటూట్ డ్యాం నిర్మాణంలో పని చేస్తున్న వందలాది భారతీయ కార్మికులను వెనక్కి రప్పిస్తోంది. ఇప్పటికే కాబూల్ లోని భారత ఎంబసీలో పని చేస్తున్న అధికారులను కూడా అక్కడి నుంచి వెనక్కి రప్పించాలా అని యోచిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చూడండి: పార్లమెంట్ సమావేశాల ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ.. ఆ కొత్త మంత్రి విదేశీయుడా ?

Etela Rajender: ఈటెల రాజేందర్ సరికొత్త వ్యూహం!.. తెరపైకి బీజేపీ అభ్యర్థిగా జమునా రెడ్డి.. అసలు కారణమదేనా?..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu